మరో పదిహోను రోజుల్లో 2023కు గుడ్‌బై చెప్పేసి 2024 కొత్తఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు. న్యూ ఇయర్ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఎక్కడ చూసినా ప్రజలు పార్టీలు, పంక్షన్‌లు ఒకటేమిటి తగ్గేదెలే అన్నట్టు సందడి చేస్తారు. ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
ఈ సందడి, సరదాలు అన్నీ ఓకే కానీ అసలు ఈ జనవరి 1న వేడుకలు చేసుకోవడం అనే సంస్కృతి ఎప్పటి నుంచి మొదలైంది. మొదటిసారి ఎప్పుడు జరుపుకున్నారు? 15వ శతాబ్దంలో తొలిసారిగా జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.
జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సంప్రదాయానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ఇది 15వ శతాబ్దంలో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1582 మార్చినెలలో ప్రారంభమైంది. అప్పటి వరకు జూలియన్ క్యాలెండర్ ప్రపంచవ్యాప్తంగా అనుసరించేవాళ్లు. అందులో కేవలం 10 నెలలు మాత్రమే ఉండగా క్రిస్మస్ రోజున కొత్త సంవత్సరాన్ని జరుపుకున్నారు. అయితే ఆ తర్వాత అమెరికాకు చెందిన అలోసిస్ లిలియస్ అనే వైద్యుడు ప్రపంచానికి కొత్త క్యాలెండర్ పరిచయం చేశారు. దీనిని గ్రెగోరియన్ క్యాలెండర్ అని పిలుస్తారు. ఈ క్యాలెండర్‌లో మొదటి రోజు జనవరి 1. అప్పటి నుంచి జనవరి 1 న కొత్త సంవత్సరాన్ని జరుపుకునే సంప్రదాయం మొదలైంది.
మార్చి ఏడాదిలో మొదటి నెలగా ఉండేది
15 వ శతాబ్దానికి ముందు మార్చిని సంవత్సరంలో మొదటి నెలగా పరిగణించేవారు. గతంలో మార్చి 25 లేదా డిసెంబర్ 25న నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. రోమ్ మొదటి రాజు నుమా పోంపలిస్ రోమన్ క్యాలెండర్‌ను మార్చికి ముందు 2 నెలలు జోడించాడు. అప్పటి నుంచి జనవరిని సంవత్సరంలో మొదటి నెలగా పరిగణిస్తారు.
రాజ్యంలో నియామకాలు, పదవీకాలాలను జనవరి 1 నుంచే లెక్కించేవాళ్లు. అధికారుల పదవీ కాలం కోసం మాత్రమే జనవరి 1ని పరిగణలోకి తీసుకనే వాళ్లు. కొత్త ఏడాది వేడుకల్ని మాత్రం మార్చి 1 నే జరుపుకునే వాళ్లు.
భారతదేశంలో కొత్త సంవత్సరాన్ని వివిధ తేదీలలో జరుపుకుంటారు
భారతదేశం అనేక సంస్కృత సంప్రదాయాలకు నిలయం. అనేక రకాల సంస్కృతులు, అనేక మతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అందుకే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. వేర్వేరు సమయాల్లో జరుపుకుంటారు. హిందూ నూతన సంవత్సరం గురించి చెప్పుకుంటే.. చైత్ర మాసంలోని శుక్ల పక్షం నుంచి మొదటి సంవత్సరం ప్రారంభమవుతుంది.
మరాఠీ ప్రజల గుడి పడ్వా సమయంలో కొత్త సంవత్సరం జరుపుకుంటారు. అప్పుడే కొత్త ఏడాదిలోకి ప్రవేశించినట్టు పరిగణనలోకి తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. కేరళలో ఏప్రిల్ నెలలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.