Siddaramaiah decided to return the lands allotted to them in the muda land scam : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్లాట్ల అక్రమ కేటయింపు కేసులో నిండా మునిగిపోతున్న సిద్దరామయ్య చివరకు బయటపడటానికి కొత్త ప్లాన్ వేశారు. తమ కుటుంబానికి ముడా కేటాయించిన ప్టాట్లు మొత్తం ఆ సంస్థకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన కుమారుడు స్వయంగా మైసూరులోని ముడా కార్యాలయానికి వెళ్లి లేఖ ఇచ్చారు. సిద్దరామయ్య భార్యకు మైసూరు సమీపంలోని గ్రామంలో భూములు ఉన్నాయి. వాటిని తీసుకుని.. అత్యంత ఖరీదైన ముడా భూముల్ని కేటాయించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సీఎం ప్రమేయం ఉందని ఆయన .. అత్యంత ఖరీదైన భూముల్ని అక్రమంగా తీసుకున్నారని సామాజిక కార్యకర్తలు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
లోకాయుక్త విచారణకు ఆదేశించడంతో సిద్దరామయ్యకు చిక్కులు
సీఎం సిద్దరామయ్యపై వచ్చిన ఆరోపణలపై విచారణకు లోకాయిక్త గవర్నర్ ను అనుమతి కోరింది. గవర్నర్ అనుమతి ఇచ్చారు. సిద్దరామయ్య హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఆయనపై మైసూరులో లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ వన్ సిద్దరామయ్యను పెట్టారు. ఈ లోపు సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశిస్తుందేమో అన్న అనుమనంతో సిద్దరామయ్య సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారు. అయితే ఈడీ రంగంలోకి దిగింది. ఈ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ పరిణామంతో ఆయన ఈ కేసు వ్యవహారంలో నిండా మునిగిపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
శర్మ ఫ్యామిలీ కాదు పాకిస్తాన్ కుటుంబం - బెంగళూరులో పోలీసులకు చిక్కిన అనుమానితులు
ప్లాట్లు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయం
ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అన్న అంశంపై ఆయన చర్చలు జరుపుతున్నారు. తీవ్రంగా ఆలోచించి భూములు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మైసూర్ అర్బన్ డెలవప్ మెంట్ అధారిటీకి లేఖ ఇచ్చారు. అయితే ముడా కమిషనర్ ఈ అంశంపై తాము న్యాయసలహా తీసుకుంటామని ప్రకటించారు. ఈ భూములు ముడా వెనక్కి తీసుకుంటే అసలు సమస్యే ఉండదని సిద్దరామయ్య భావిస్తున్నారు. తాము ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని..భూమిని తీసుకుని భూమి ఇచ్చారని రాజకీయ కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గీయులు అంటున్నారు.
స్టార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో అనుపమ్ ఖేర్ ఫోటోతో కరెన్సీ - బంగారం వ్యాపారి బలైపోయాడు !
ఈడీ కేసు కూడా నమోదు కావడంతో కీలక నిర్ణయం
ఇందలో ఎక్కడా మనీ ట్రాన్సాక్షన్స్ లేకపోయినా ఈడీ కేసు నమదు చేయడం కేవలం వేధింపుల కోసమేనని.. ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని అంటున్నారు. మరో వైపు బీజేప నేతలు సిద్దరామయ్య రాజీనామా చేయాలని పట్టుబడుతన్నారు. ఆందోళనలు చేస్తున్నారు. అయితే రాజీనామా చేస్తే తప్పు చేసినట్లుగా అంగీకరించినట్లు అవుతుందని అలాంటి ప్రశ్నే లేదని సిద్దరామయ్య చెబుతున్నారు.