Peru Delivery Man:


800 ఏళ్ల నాటి మమ్మీ 


సింగిల్‌గా ఉన్నంత వరకూ ఓకే. ఒక్కసారి రిలేషన్‌షిప్‌లోకి దిగారా ఇక అంతే. ఒకరినొకరు విడిచిపెట్టి ఉండటం చాలా కష్టమనిపిస్తుంది. తరచూ కలుస్తుంటారు. ఇంకొందరైతే డేటింగ్ వరకూ వెళ్లిపోతారు. ఇలాగే పెరులోని ఓ డెలివరీ బాయ్‌ లవ్‌లో పడ్డాడు. గర్ల్‌ఫ్రెండ్‌ని విడిచి పెట్టి ఉండలేక ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. దాదాపు 30 ఏళ్లుగా ఇద్దరూ కలిసే జీవిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి పోలీసులు వచ్చి తన గర్ల్‌ఫ్రెండ్‌ని తీసుకెళ్లిపోయారు. అప్పుడు కానీ ప్రపంచానికి తెలియలేదు ఈ లవ్‌స్టోరీ. ఈ కథలో ట్విస్ట్ ఏంటో తెలుసా..? ఆ లవర్‌ మనిషి కాదు. మమ్మీ. అవును. 600-800 సంవత్సరాల క్రితం నాటి మమ్మీని తన గర్ల్‌ఫ్రెండ్‌గా చేసుకున్నాడు. 30 ఏళ్ల నుంచి తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. మరి ఇన్నేళ్ల నుంచి మమ్మీని ఎలా ప్రిజర్వ్ చేశాడు అనే డౌట్ రావచ్చు. దానికీ వివరణ ఇచ్చాడీ మమ్మీ  ప్రేమికుడు. ఐసో థర్మల్ బ్యాగ్‌లో పెట్టాడట. 26 ఏళ్ల జూలియోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు. ఎందుకిలా చేశారు..? అని లోకల్ మీడియా జూలియోను ప్రశ్నించగా..."తను నాకు స్పిరిచ్యుయల్ గర్ల్‌ఫ్రెండ్" అంటూ అర్థం కాని సమాధానమిచ్చాడు. 


"ఇన్నేళ్లుగా కలిసే జీవించాం. నా రూమ్‌లోనే తనకు చోటిచ్చాను. నాతోనే రోజూ నిద్రించేది. నేను తనను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. 30 ఏళ్ల క్రితం మా నాన్న ఈ మమ్మీని ఇంటికి తీసుకొచ్చాడు. " 


-జూలియో, మమ్మీ ప్రేమికుడు


పురుషుడట..


ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే...ఆ మమ్మీని గర్ల్‌ఫ్రెండ్ అని జూలియో చెప్పుకుంటున్నా...ఆ మమ్మీ పురుషుడిదేనని తేల్చి చెప్పారు పెరు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు. 45 ఏళ్ల పురుషుడుగా వెల్లడించారు. బ్యాండేజ్‌లతో బాడీని కట్టేసినట్టు వివరించారు. పునోలోని ఓ పార్క్‌కి ఈ మమ్మీని ఓ బ్యాగ్‌లో పెట్టుకుని తీసుకొచ్చాడు జూలియో. పోలీస్ ప్యాట్రోలింగ్ జరిగిన సమయంలో దీన్ని గుర్తించారు. ఈ మమ్మీని విక్రయించేందుకు చూశారని పోలీసులు చెబుతున్నా...జూలియో మాత్రం కొట్టి పారేశాడు. కేవలం తన ఫ్రెండ్స్‌కి చూపించేందుకు బయటకు తీసుకొచ్చాని చెప్పాడు. మొత్తానికి ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 


మత్స్యకన్య మమ్మీ


1736 నుంచి 1741 మధ్యలో జపాన్లోని పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ఒక సాగరకన్యలాంటి జీవి దొరికింది. అది మరణించడంతో ప్రజలు మమ్మీ రూపంలో భద్రపరిచారు. దాని వయసు ఇప్పుడు 300 ఏళ్లు. అది మొదట్లో ఒక కుటుంబం వద్ద ఉండేదని, వారు చనిపోయాక చేతులు మారుతూ వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం జపాన్లోని ఓ నగరంలో ఉన్న ఆలయంలో ఉంది. దాన్ని భద్రపరిచిన పెట్టెలో ఒక ఉత్తరం కూడా ఉంది. దాని ప్రకారం ఈ సాగరకన్య చేపలు పట్టే వలలో పడిందని రాసి ఉంది. ఆ మమ్మీని జపాన్ పరిశోధకులు స్వాధీనం చేసుకున్నారు. మత్స్యకన్య మమ్మీ చూసేందుకు చాలా భయంకరంగా ఉంది. పదునైన దంతాలు, ముఖం, రెండు చేతులు, నుదుటిపై పడుతున్న వెంట్రుకలతో ఉంది. ఎగువ భాగంలో మనిషిలా, దిగువ భాగంలో చేపలా ఉంది. 


Also Read: Bird Flu In China: మనిషికి బర్డ్‌ ఫ్లూ సోకిందట, చైనాలో తొలి కేసు నమోదు