Husband drugged his wife and invited 73 men to rape :  ఫ్రాన్స్ షాపింగ్ లో  అమ్మాయిలు పొట్టి స్కర్టులు వేసుకుని షాపింగ్ చేస్తూంటే వారిని అసభ్య యాంగిల్స్ లో ఫోటోలు తీస్తున్న డొమినిక్ పెలికాట్ అనే 71 ఏళ్ల పెద్దాయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఫోన్, గాడ్జెట్ ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే.. ఒకే మహిళను పలువురు అత్యాచారం చేస్తున్న ఫోటోలు దర్శనం ఇచ్చాయి. ఆ మహిళ అచేతనంగా ఉండంటంతో పోలీసులకు డౌట్ వచ్చి నాలుగు తగిలించేసరికి నిజం ఒప్పుకున్నాడు.  ఆ నిజం ఏమిటంటే.. ఆ మహిళ తన భార్యే. ఆ ఆత్యాచారం చేస్తున్న మనుషుల్ని కూడా ఆయనే పిలిపించాడు. ఈ కథ చాలా తేడాగా ఉండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి మొత్తం విషయాలు రాబట్టారు. 


డొమినిక్ పెలికాట్ ఫ్రాన్స్ ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ లో పని చేసి రిటైర్ అయ్యాడు. అతని భార్యతో యాభై ఏళ్లకుపైగా  కాపురం చేస్తున్నారు. ఆమెకు కూడా 70 ఏళ్ల వయసు ఉంటుంది.  ఏం అయిందో కానీ.. గత పధ్నాలుగేళ్ల నుంచి ఆయన భార్యకు డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాక.. అపరిచితుల్ని పిలిపించి  రేప్ చేయిస్తున్నాడు. అందర్నీ ఒకే సారి కాదు. ఒక్కొక్కరిని మాత్రమే పిలిపించేవాడు. వచ్చిన వాళ్లు పెలికాట్ భార్యను.. అపస్మారక స్థితిలోనే ఉండగానే అత్యాచారం చేసి ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయేవాళ్లు. ఆమె తేరుకున్న తర్వాత ఏదో తేడాగా ఉన్నా.. గుర్తించలేకపోయింది. 


ఎంత డబ్బుంటే మాత్రం 7 వేల కార్లు కొంటారా ? ఈ సుల్తాన్ కొంటారు !                           


అలా మొత్తం ఇప్పటి వరకూ 72మందితో భార్యపై అత్యాచారం చేయించారు. వీరిలో కొంత మంది రెండు సార్లు కూడా వచ్చారు. అలా మొత్తం 98 సార్లు ఆయన భార్యను రేప్ చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్లను.. ఇతర చిన్న  చిన్న పనులు చేసుకునే వారిని ఈ పని కోసం.. మాట్లాడేవాడు డొమినిక్. అత్యాచారం చేస్తున్న సమయంలో తన భార్య నిద్ర లేవకుండా.. పక్కా   డ్రగ్స్ ఎక్కించేవారని చెబుతున్నారు. 


ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి, సోషల్ మీడియాలో ఒక్క పోస్టుకు సంపాదన ఎంతంటే!              


అయితే ఇలా అత్యాచారం చేసిన వారిలో కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఇదంతా  మ్యూచువల్ గా జరుగుతోందని తాము అనుకున్నామని.. వారికి అదో ఫాంటసీ అనుకున్నాం కానీ.. అత్యాచారం చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే కోర్టులో మాత్రం ఆయన భార్య అలాంటి ఫాంటసీలేమీ లేవని.. తన పరిస్థితి ఓ హైస్పీడ్ ట్రైన్ ఢీ కొట్టినట్లుగా ఉందని తెలిపింది. మొత్తంగా ఆ ముసలి భర్త తన భార్యపై చేసిన అరాచకం వైరల్ గా మారింది.