Vijayawada lineman died | విజయవాడ: భారీ వర్షాలు, వరద నీటి ప్రవాహంతో విజయవాడ నగరవాసులు ఉలిక్కిపడ్డారు. సోమవారం నుంచి వరద ప్రభావం తగ్గుతోందని, విజయవాడ వాసులకు ఏ ఇబ్బంది లేదని మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత చెప్పారు. అయితే భారీ వర్షాలతో విజయవాడలో పలు కాలనీలు అంధకారంలోకి వెళ్లగా, నేడు విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచారు. కానీ విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. విజయవాడలో సహాయక చర్యల్లో వజ్రాల కోటేశ్వరరావు అనే లైన్ మెన్ పాల్గొన్నాడు. ఒక్కసారిగా వరదనీటిలో కోటేశ్వరరావు కొట్టుకుపోయాడు. విద్యుత్ పునరుద్ధరణ పనులకు వచ్చి లైన్ మెన్ మృతిచెందడంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లైన్ మన్ భార్యకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు.
Vijayawada Floods: విజయవాడలో అపశ్రుతి, వరదలో కొట్టుకుపోయి లైన్మెన్ మృతి - మంత్రి గొట్టిపాటి విచారం
Shankar Dukanam
Updated at:
03 Sep 2024 06:09 PM (IST)
Vijayawada Flood | విజయవాడలో సహాయక చర్యల్లో పాల్గొన్న లైన్మెన్ వరద నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. లైన్మెన్ కుటుంబానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫోన్ చేసి మాట్లాడారు.
Vijayawada Floods: విజయవాడలో అపశ్రుతి, వరదలో కొట్టుకుపోయి లైన్మెన్ మృతి - మంత్రి గొట్టిపాటి విచారం