World Richest Cat :  సాధారణంగా జనాలు డబ్బు సంపాదన కోసం రకరకాల పనులు చేస్తుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే ధనవంతులు అవుతారు. అలా మారడానికి వారికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే మనుషులు ఓకే.. కానీ, జంతువులు కూడా వందల కోట్ల ఆస్తిని సంపాదిస్తున్నాయని తెలిస్తే షాక్ అవుతారేమో. అవును మీరు వినేది నిజమే. వందల కోట్ల ఆస్తులు ఉన్నపెంపుడు పిల్లి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దాని పేరు నాలా.  పెంపుడు పిల్లి, ప్రపంచంలోని అత్యంత సంపన్న పెంపుడు జంతువుల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఆ పిల్లికి ఇంత మొత్తం ఎలా వచ్చిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే... 


ఒక్కో పోస్టుకు రూ.12లక్షలు
ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లిగా పరిగణించబడుతున్న నాలా నికర విలువ రూ. 852 కోట్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు ఆ పిల్లి రూ. 12 లక్షలు సంపాదిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న నాలా  ప్రయాణం జంతువుల ఆశ్రయం వద్ద ప్రారంభమైంది. పూకీ అని పిలువబడే ఆమె యజమాని.. లాస్ ఏంజిల్స్‌లోని రెస్క్యూ సెంటర్‌లో ఆ పిల్లిని కనుగొన్నారు. పిల్లిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిన పూకీ దానిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది.   


4.5మిలియన్ల ఫాలోవర్స్
దానిని తీసుకుని ఇంటికి వచ్చి అపురూపంగా చూసుకోవడం ప్రారంభించింది. అంతే కాకుండా దానిపేరు మీద ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసింది. దాంట్లో వారి కలిసి ఉన్న క్షణాలను పోస్ట్ చేస్తూ వచ్చింది. క్రమక్రమంలో ఫాలోవర్స్ పెరగడంతో నాలా సంచలనంగా మారింది. నాలా ఇన్‌స్టాగ్రామ్ లో 4.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఇప్పటి వరకు 7,267 పోస్ట్‌లను షేర్ చేశారు.  నాలా సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ దక్కించుకుంది. ఆమె రూ.850కోట్లకు పైగా సంపాదించింది. అంటే నాలా ఒక్కో పోస్ట్‌కు సగటున రూ.12,000లక్షలు సంపాదించినట్లే.


 గిన్నిస్ రికార్డు
 నాలా పాపులారిటీ ఒక్క సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం కాదు. పిల్లి క్యాట్ ఫుడ్ బ్రాండ్‌ అంబాసిడర్ గా నిలిచింది.  అది తన స్వంత సరుకుల బ్రాండ్‌ను ప్రారంభించింది. నాలా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అయ్యే పిల్లిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కూడా నమోదు చేసింది. నలుగురు మానవ పోటీదారులను అధిగమించి టిక్‌టోకర్ ఆఫ్ ది ఇయర్ బిరుదును సంపాదించింది. ఆ పిల్లి యజమాని పూకీ కూడా నాలా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నిర్వహించేందుకు ఉద్యోగం మానేసి తన పూర్తి సమయం  కేటాయిస్తోంది. ఈ పిల్లి అంటే పూకీకి చాలా ఇష్టం.


 నాలా తర్వాత ఉన్న పిల్లులు
ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న పిల్లి ఒలివియా బెన్సన్. ఈ పిల్లి నికర విలువ $97 మిలియన్లు.  మూడవ అత్యంత సంపన్న పిల్లి దివంగత జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ ఒట్టో లాగర్‌ఫెల్డ్ కు చెందిన  చౌపెట్టే  దీనికి $13 మిలియన్ల  సంపద ఉంది.   స్మూతీ ప్రపంచంలోనే అత్యంత ఫోటోజెనిక్ పిల్లి, ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న నాలుగవ పిల్లి, ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు దాదాపు $7,423 సంపాదిస్తుంది.


Also Read: 4 day Work Week: ఉద్యోగులకు శుభవార్త- ఇక వారానికి నాలుగు రోజులే పని, ఎక్కడంటే ?