ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని కబుర్లు చెబుతున్నారా? అయితే, అతడిలా మీరు చేయగలరా? తప్పకుండా మీరు ఈ సవాల్‌ను ఓడిపోతారు. ఎందుకంటే.. అతడు తన ప్రియురాలి కోసం అమ్మాయి వేషం వేశాడు. ప్రియురాలి స్థానంలో ఆమె హైస్కూల్ పరీక్ష రాసేందుకు అతడు ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాడు. ఇంతకీ అతడు పరీక్షలు రాయగలిగాడా? ఇన్విజిలేటర్లు అతడిని గుర్తుపట్టారా? చివరికి ఏమైంది? 


పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌లో గల డైయోర్బెల్‌లోని గాస్టన్ బెర్గర్ డె సెయింట్-లూయిస్ యూనివర్శిటీకి చెందిన ఖాదీమ్ ఎంబౌప్.. హైస్కూల్‌లో చదువుతున్న ప్రియురాలు గంగు డియోమ్ కోసం అమ్మాయి వేషం ధరించాడు. ఆమెకు బదులుగా.. అతడు పరీక్షకు హాజరయ్యాడు. చిత్రం ఏమిటంటే.. అతడు వరుసగా మూడు పరీక్షలకు అమ్మాయి వేషంలో వెళ్లినా.. ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఆఫ్రికా సాంప్రయా దుస్తుల్లో.. చేవులకు రింగులు, స్క్రాఫ్, మేకప్ వేసుకోవడం వల్ల పరీక్షల నిర్వాహకులు అతడిని అమ్మాయనే భావించారు. అయితే, ఓ ఎగ్జామ్ ఇన్విజిలేటర్ వద్ద అతడి పప్పులు ఉడకలేదు. గంగు వేషాలను గుర్తుపట్టేశాడు. 


ఈ సందర్భంగా గంగు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నా పూర్తిగా ప్రేమలో మునిగిపోయాను. పరీక్షలు రాయడానికి తాను పడుతున్న ఇబ్బందిని చూడలేకపోయాను. ఆమె ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది’’ అని తెలిపాడు. ప్రస్తుతం ప్రేమికులు ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. 


Also Read: ఏటీఎం మెషిన్‌లో ఇరుక్కుపోయిన దొంగ.. చోరీ ప్లాన్ విఫలమై పాట్లు!


ఆ ఇద్దరిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఐదేళ్ల వరకు వారిద్దరు ఏ నేషనల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్‌ గానీ, క్వాలిఫికేసన్, డిప్లమా పరీక్షలు రాయకుండా బ్యాన్ విధిస్తున్నట్లు పబ్లిక్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు ప్రకటించారు. అంతేకాదు కోర్టు ఆ ఇద్దరికి భారీ జరిమానాతోపాటు 1 నుంచి ఐదేళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదివరకు బొలివియన్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా తన ప్రియురాలి కోసం పరీక్ష రాసేందుకు అమ్మాయి వేషంలో వచ్చి అడ్డంగా బుక్కైపోయాడు. దీంతో అధికారులు ఆ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఏ పరీక్షలు రాయకుండా వారిపై ఆంక్షలు విధించారు. చూశారుగా.. మీరు మాత్రం ఇలాంటి పనులు చేయకండి. బంగారం లాంటి భవిష్యత్తు నాశనమవుతుంది. 


Also Read: అది దెయ్యమేనా? కెమేరాకు చిక్కిన వింత ఆకారం.. నాగపూర్ ప్రజల్లో గుబులు!


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!