స్కూల్ అసెంబ్లీ అంటే చాలా మందికి మొదట గుర్తుకు వచ్చేది అక్కడ చదివే న్యూస్ హెడ్‌లైన్స్‌. కొన్ని స్కూల్స్‌లో ఉపాధ్యాయులే ఈ హెడ్‌లైన్స్ సిద్ధం చేస్తారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మీ అందరికి కోసం ఇక్కడ హెడ్‌లైన్స్ ఇస్తున్నాం. 


స్కూల్ అసెంబ్లీ కోసం కావాల్సిన జాతీయ వార్తలు 
1. జనవరి 22న అయోధ్యలో నిర్వహించే శ్రీరామ మందిరం ప్రారంభోత్స వేడుకను న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద లైవ్‌ టెలికాస్ట్ చేయనున్నారు. 
2. ఇన్‌కాంట్యాక్స్‌ రిటర్న్స్‌లో 29,000 కంపెనీలు 44,000 కోట్ల విలువైన ఫేక్ క్లెయిమ్‌లకు పాల్పడినట్టు గుర్తించారు జీఎస్టీ అధికారులు గుర్తించారు. 
3. బీచ్ టూరిజం విషయంలో ముగ్గురు మాల్దీవ్స్‌ మంత్రులు వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీంతో నెటిజన్లు #boycottmaldives హ్యాష్‌ట్యాగ్‌తో విమర్శలు చేశారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా వారిపై వేటు వేసింది అక్కడి ప్రభుత్వం. 
4 లాఠీలతో కాకుండా డేటాతో పని చేయాలని పోలీసులకు ప్రధాని మోదీ చూసించారు. జైపూర్‌లో జరిగిన 58వ డీజీపీలు ఐజీల సదస్సులో ఆయన ప్రసంగించారు. 
5. పార్లమెంట్ ఎంపీలకు ఇచ్చే సంసద్‌ రత్న అవార్డు ఈసారి ఐదుగురికి దక్కింది. బీజేపీ నుంచి ఇద్దరు, శివసేన నుంచి ఒకరు, ఒక కాంగ్రెస్ ఎంపీ, ఎన్సీపీ ఎంపీకి అవార్డు వరించింది. 


నేటి స్కూల్‌ హెడ్‌లైన్స్ కోసం అంతర్జాతీయ వార్తలు 
1. షేక్ హసీనా ఐదోసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నిక్లలో ఆమె పార్టీ అవామీ లీగ్‌ భారీ మెజార్టీతో విజయం సాధించింది. 
2 .ఒమిక్రాన్ కొత్త వేరియెంట్‌ జేఎన్‌1 ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దాదాపు 41 దేశాల్లో ఈ వైరస్‌ను వైద్యులు గుర్తించారు. సింగపూర్‌, అమెరికా సహా పలు దేశాల్లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. 
3. అమెరికాలోని నార్త్‌ డకోటాలో బొగ్గుగని కార్మికులకు మంచు యుగం నాటి ఏనుగు దంతం దొరికింది. ఏడు అడుగుల పొడవు ఉన్న ఆ దంతం పదివేల ఏళ్ల నాటిదని భావిస్తున్నారు. 


న్యూస్‌ హెడ్‌లైన్స్  కోసం స్పోర్ట్స్ న్యూస్ 
1.టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఆప్ఘనిస్థాన్‌తో జరగబోయే టీ20 జట్లు స్థానం చాన్స్ దక్కింది. టీంను లీడ్ చేయనున్న రోహిత్ శర్మ.
2. స్పెయిన్ టెన్నిస్‌ ప్లేయర్‌ రఫెల్‌ నాదల్‌ ఆస్ట్రేలియా ఓపెన్ 2024 గ్రాండ్‌ స్లామ్‌ నుంచి తప్పుకున్నారు. కండరాల నొప్పి కారణంగా దూరంగా ఉంటున్నట్టు వెల్లడించారు. 


జనవరి 8న జరుపుకునే ముఖ్యమైన రోజులు 
ఎర్త్‌ రొటేషన్ డే. 
ప్రపంచ టైపింగ్ దినం 
వార్‌ ఆన్‌ పోవర్టీ డే