Venkatesh at Saindhav Pre Release Event: వెంకటేశ్ కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్’.. ఈసారి సంక్రాంతి బరిలోకి దిగనుంది. జనవరి 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. అందులో ‘సైంధవ్’ వస్తుందని, జనవరి 13 బ్రహ్మాండంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు వెంకటేశ్.
యాక్షన్ చాలా కొత్తగా చేశాను..
‘‘వైజాగ్ అంటే నాకు ఇష్టం ఇష్టం. నా మొట్టమొదటి సినిమా నుండే మీరు చాలా ప్రేమ, ఆదరణ చూపించారు. కలియుగ పాండవులు, సుందరకాండ షూటింగ్స్‌కు ఇక్కడికే వచ్చాను. పెళ్లికాని ప్రసాద్ ఇక్కడే తిరిగాడు. గురు ఇక్కడే చేశాను. గోపాల గోపాలకు పవన్‌తో వచ్చాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కోసం నా తమ్ముడు మహేశ్‌తో వచ్చాను. ఇప్పుడు సైంధవ్‌తో వచ్చాను. స్టీల్ ప్లాంట్‌లో రాత్రి రెండు గంటల వరకు షూట్ చేశాం. ఫ్యాన్స్ మీరుంటే చాలు. అక్క, బావ, తాత, అమ్మమ్మ అందరూ సైంధవ్‌కు రావాలి. నా 75వ సినిమా. చాలా ఎమోషనల్, యాక్షన్, న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా తీశాం. శైలేష్ చాలా బ్రాగా ప్రెజెంట్ చేశాడు. మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను. ఎమోషనల్ సీన్స్‌లో అన్ని సినిమాలను బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరం చాలా కష్టపడి ఒక మంచి సినిమా ఇవ్వాలని సైంధవ్ చేశాం’’ అంటూ తన వైజాగ్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. ఫ్యాన్స్‌ను ‘సైంధవ్’ చూడాలని కోరారు వెంకటేశ్.
డైలాగులతో ఫ్యాన్స్‌లో జోష్..
‘‘పండగ రోజు సైంధవ్ వస్తుంది. ఇది మామూలు పండగ కాదు. పండగే పండగ’’ అంటూ ఫ్యాన్స్‌ను అరవమని ఎంకరేజ్ చేశాడు వెంకీ మామ. అదే సమయంలో తనను ఒక డైలాగ్ చెప్పమని ఫ్యాన్స్ కోరారు. ‘‘వెళ్లేముందు చెప్పి వెళ్లా. వినలా. అంటే భయం లేదు. లెక్క మారుతుంది నా కొడకల్లారా. ఇలా చాలా పెట్టాడు సినిమాలో అక్కడక్కడ పంచ్‌లు. ఇంకొకటి కూడా ఉంది. షర్ట్ వేసుకున్న ప్రతీవాడికి కాలర్ ఉంటుందిరా. కానీ ఆ కలర్ ఎవరి మెడ మీద ఉందో చూసుకొని దానికి ఒక రెస్పాక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుతుంది నాకొడకా’’ అంటూ బ్యాక్ బ్యాక్ డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు వెంకటేశ్. ‘‘మీరు ఇంత ఓపిగ్గా ఉన్నారు. పారిపోలేదు అది చాలు నాకు’’ అంటూ ఫ్యాన్స్‌ను ప్రశంసించారు.
అందరూ బాగుండాలి, లైఫ్ సీరియస్‌గా తీసుకోవద్దు..
‘‘శైలేష్ అందరి గురించి చెప్పాడు కానీ సారా పాప గురించి చెప్పలేదు. నేను చెప్తాను. మా సినిమాకు హీరో సారా పాపే. తను చాలా అద్భుతంగా నటించింది. మీకు నచ్చుతుంది’’ అని చెప్పిన వెంకటేశ్.. మధ్యమధ్యలో ఫ్యాన్స్‌తో కూడా మాట్లాడారు. అందరూ బాగుండాలి, లైఫ్ సీరియస్‌గా తీసుకోవద్దని, దేవుడు అందరికీ అన్ని ఇస్తాడని అన్నారు. తన స్పీచ్ ముగించే ముందు ‘సైంధవ్’ మూవీ జనవరి 13న విడుదల అని గుర్తుచేశారు. ‘సైంధవ్’ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా.. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో రుహానీ శర్మ, ఆండ్రియా వంటి హీరోయిన్లు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. బాలీవుడ్‌లో వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధికీ.. ‘సైంధవ్’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు.
Also Read: నాకు ఇక్కడ హీరోలు ఎవరూ నచ్చలేదు - ‘సైంధవ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శైలేష్ కొలను