Naa Saami Ranga Trailer Release Date: ఈసారి సంక్రాంతి బరిలో తగ్గేదే లే అంటూ టాలీవుడ్ సీనియర్ హీరోలు పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు సంక్రాంతికి తెలుగు నుండి అయిదు సినిమాలు విడుదలను అనౌన్స్ చేయగా.. అందులో నుండి ఒక్కటైన ‘ఈగల్’ పక్కకు తప్పుకుంది. దీంతో నాగార్జున నటించిన ‘నా సామిరంగ’కు కలిసొచ్చింది. ‘ఈగల్’ తప్పుకునే ముందు అదే రోజు విడుదలకు సిద్ధమయిన ‘నా సామిరంగ’కు తమ థియేటర్లను ఇచ్చారు మేకర్స్. ఇక జనవరి 14న విడుదల కానున్న ‘నా సామిరంగ’ ట్రైలర్ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్.


ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..
నాగార్జున, అషికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘నా సామిరంగ’ ట్రైలర్‌ను జనవరి 9న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. జనవరి 9న మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా ఎంతోమంది యంగ్ హీరోలకు కొరియోగ్రాఫీ చేసిన విజయ్ బిన్నీ.. ‘నా సామిరంగ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదొక మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. డెబ్యూ సినిమానే అయినా హీరోహీరోయిన్ల క్యారెక్టర్లను బాగా చూపించాడంటూ విజయ్ బిన్నీపై ప్రశంసలు కురిపించారు ఫ్యాన్స్.






యంగ్ హీరోలకు ప్రాధాన్యం..
‘నా సామిరంగ’లో హీరోగా నాగార్జున నటించగా.. ఇతర కీలక పాత్రల్లో యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కనిపించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా కూడా వీరికి హిట్ మాత్రం రావడం లేదు. ఇక ఈ మూవీలో నాగార్జునకు సమానమైన పాత్రలు చేసినట్టు టీజర్ చూస్తే అనిపిస్తుంది. అంతే కాకుండా వీరి పాత్రలకు సెపరేటుగా ఇంట్రడక్షన్స్ కూడా ఇస్తూ సినిమాలు అల్లరి నరేశ్‌ను, రాజ్ తరుణ్‌ను హైలెట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అల్లరి నరేశ్ గురించి చెప్పడానికి ఏకంగా ప్రత్యేకమైన గ్లింప్స్‌నే విడుదల చేశాడు. ‘నా సామిరంగ’లో అంజి పాత్రలో అల్లరి నరేశ్, భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నారు.


హీరోయిన్స్ ఫిక్స్..
‘నా సామిరంగ’లో నాగార్జునకు అషికా రంగనాథ్ హీరోయిన్‌గా ఉన్నట్టుగా.. ఈ మూవీలో సెకండ్ హీరోల పాత్రలు చేసిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ పాత్రలకు కూడా హీరోయిన్స్ ఉన్నారు. ఇందులో అల్లరి నరేశ్‌కు జంటగా మిర్నా మోహన్ నటిస్తుండగా.. రాజ్ తరుణ్‌కు జోడీగా రుక్సార్ మెరిసింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ కాబట్టి ‘నా సామిరంగ’పై నాగ్ ఫ్యాన్స్‌లో అంచనాలు బాగానే ఉన్నాయి. ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో కూడా ఇంచుమించు ఇలాంటి పాత్రలోనే కనిపించి అప్పట్లో సంక్రాంతికి హిట్ అందుకున్నారు నాగ్. ఇప్పుడు కూడా అదే క్యారెక్టరైజేషన్, అలాంటి మాస్ ఎలిమెంట్స్‌తోనే వచ్చి నాగార్జున కచ్చితంగా హిట్ కొడతారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అందుకే ఇప్పటినుండి ట్రైలర్ విడుదల కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు.


Also Read: మాస్ మాస్ మాస్ - మొత్తం మహేష్ ఊర మాసే - ‘గుంటూరు కారం’ ట్రైలర్ చూశారా?