26th July School News Headlines Today: 


తెలంగాణ వార్తలు:

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. మొత్తం 2 లక్షల 91 వేల 159కోట్లతో బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. వ్యవసాయానికి అత్యధికంగా 72 వేల 659 కోట్ల రూపాయలు కేటాయించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రారంభిస్తామని ఆర్థికమంత్రి తెలిపారు.

 

తెలంగాణ బడ్జెట్‌లో విద్యకు పెద్ద పీట వేశారు. విద్యకు 21 వేల 292 కోట్ల రూపాయలు కేటాయించారు. వైద్య, ఆరోగ్య శాఖలకు 11 వేల 468 కోట్లు ఇచ్చారు. నీటి పారుదల రంగానికి 22 వేల 301 కోట్లు కేటాయించారు.

 

ఆంధ్రప్రదేశ్‌ వార్తలు: 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేడు ఆర్ధిక క శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనుంది. గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆదాయం, అప్పులను ప్రజలకు వివరించేందుకు కూటమి ప్రభుత్వం ఈ వైట్‌ పేపర్‌ను రిలీజ్‌ చేయనుంది. 

 

ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ కీలక ప్రకటన చేశారు. కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం ఇస్తామని ప్రకటించారు. విధి విధానాలు అమలు చేయడానికి ఇంకాస్త సమయం పడుతుందున్నారు. మాతృభాషను కాపాడుకుంటూ ఆంగ్లానికి ప్రాధాన్యం ఇస్తామని లోకేశ్‌ ప్రకటించారు.

 

జాతీయ వార్తలు

రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌, అశోక్‌ హాల్‌  పేర్లను మారుస్తున్నట్లు రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది. ఇకపై దర్బార్‌ హాల్‌ పేరును గణతంత్ర మండపంగా.. అశోక్‌ హాల్‌ పేరును అశోక్‌ మండపంగా పిలవనున్నారు. 

 

నీట్‌ యూజీ 2024 పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ CBI విచారణను వేగవంతం చేసింది. జార్ఖండ్‌లోని నిందితుడు అవినాష్‌కు చెందిన 16 ఫోన్లను ఓ చెరువు నుంచి సీబీఐ స్వాధీనం చేసుకుంది. 

 

అంతర్జాతీయ వార్తలు

1940వ సంవత్సరం తర్వాత అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రత..  ఈనెల 22న నమోదైంది. జులై 22న ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 1940వ ఏడాది తర్వాత ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. టెంపరేచర్‌ పెరగడంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

క్రీడలు

పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ టీమ్‌ సత్తా చాటింది. నాలుగో స్థానంలో నిలిచి భార‌త మహిళల జ‌ట్టు క్వార్టర్ ఫైన‌ల్స్‌కు అర్హత సాధించింది. అంకితా భాక‌త్‌, భ‌జ‌న్ కౌర్‌, దీపికా కుమారి.. టాప్ 32లో నిలిచి క్వార్టర్స్‌కు చేరింది.

 

మంచిమాట

మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు కొత్త రోగాలను ఇస్తాయి.