Russia Ukraine War: 


40 నగరాల్లో దాడులు..


క్రిమియాలోని క్రెచ్ వంతెనపై బాంబు దాడి జరిగినప్పటి నుంచి ఉక్రెయిన్‌పై పుతిన్ ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. ఇది కచ్చితంగా ఉక్రెయిన్ చేసిన పనేనని చాలా గుర్రుగా ఉన్నారు. అందుకే...ఆ దేశంపై మరింత కక్ష పెంచుకున్నారు. వెంటనే...ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌లోని 40 ప్రాంతాలపై క్షిపణుల దాడులు చేసింది రష్యా. రాజధాని కీవ్‌లోనూ దాడి జరిగింది. డ్రోన్‌ల సాయంతో ఇలా విరుచుకుపడింది రష్యా సైన్యం. అయితే...ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారన్నది మాత్రం ఇంకా లెక్క తేలలేదు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత కీలకమైన వసతులన్నింటినీ ధ్వంసం చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్‌ ఓ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ వాయుసేన..రష్యా డ్రోన్ దాడులను గట్టిగానే ఎదుర్కొంది. ఎదురు దాడికి దిగి రష్యాలోని 25 ప్రాంతాలపై 32 సార్లు దాడి చేసినట్టు వెల్లడించింది. అటు రష్యా మాత్రం..వెనక్కి తగ్గకుండా ఉక్రెయిన్‌లోని 40 చోట్ల దాడులకు తెగబడింది. మైకోలైవ్ నగరంలోనే ఎక్కువ నష్టం కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ నగర మేయర్‌ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. "మైకోలైవ్ నగరంపై దారుణంగా దాడి జరిగింది. ఓ ఐదంతస్తుల భవంతిపై బాంబుల వర్షం కురిసింది. రెండంతస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిగతావి కూలిపోయే దశలో ఉన్నాయి. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి" అని వెల్లడించారు. ఈ దాడిపై నాటో స్పందించింది. "ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో ఓడిపోతున్నామనే అసహనంతోనే రష్యా ఈ పని చేస్తోంది" అని నాటో సెక్రటరీ జనరల్ అన్నారు. మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీయాలన్న దురుద్దేశంతోనే రష్యా ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని అభిప్రాయపడ్డారు. 


క్రెచ్‌ దాడికి ప్రతీకారమా? 


రష్యా ఆక్రమిత క్రిమియాలోని ఓ బ్రిడ్జ్‌పై బాంబు దాడి జరిగింది. ఓ ట్రక్‌లో బాంబ్ పేలడం వల్ల ఆ వంతెన పూర్తిగా డ్యామేజ్ అయింది. రష్యాను-క్రిమియాను అనుసంధానించే కీలకమైన బ్రిడ్జ్ ఇదే. దీనిపైనే అటాక్ జరగటంపై రష్యా అప్రమత్తమైంది. విచారణకు ఆదేశించింది. రష్యా విచారణ కమిటీ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. రష్యా యాంటీ టెర్రరిజం కమిటీ కూడా అప్రమత్తమైంది. ట్రక్ బాంబ్ పేలటం వల్ల వంతెనపై రెండు చోట్ల భారీ డ్యామేజ్ జరిగిందని వెల్లడించింది. అయితే...ఎవరిపైన అయినా అనుమానాలున్నాయా అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ 70 వ పుట్టిన రోజు జరుపుకున్న మరుసటి రోజే ఈ దాడి జరగటం చర్చకు దారి తీసింది.క్రిమియా అనేది రష్యాకు చాలా కీలకమైన ప్రాంతం. చెప్పాలంటే...ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది రష్యా. అంతే కాదు. మిలిటరీ ఆపరేషన్స్ చేపట్టేందుకూ క్రిమియా చాలా వ్యూహాత్మకం. క్రిమియాకు ఆయుధాలు తరలించా లంటే...ఇప్పుడు బాంబు దాడి జరిగిన వంతెనే కీలకం. ఒకవేళ ఇది పూర్తిగా ధ్వంసమై వినియోగించేందుకు వీల్లేకుండా పోతే రష్యా చాలా నష్టపోవాల్సి వస్తుంది. రక్షణ పరంగానూ రష్యాకు ఇది ప్రమాదకరమే. ఈ దాడి ఉక్రెయిన్ చేసిందన్న అనుమానంతో...క్షిపణుల దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది.. రష్యా. 


Also Read: Anil Vij On Hijab Ban: కంట్రోల్ లేని పురుషులే మహిళలను హిజాబ్ ధరించమంటారు: భాజపా మంత్రి