ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న ప్రాంతాలకు భారత విదేశాంగ శాఖ తన బృందాలను పంపిస్తోంది.

To assist in the evacuation of Indian nationals from Ukraine, MEA teams are being sent to the land borders with Ukraine in Hungary, Poland, Slovak Republic and Romania, says the Ministry pic.twitter.com/L6iZYbukUS


— ANI (@ANI) February 24, 2022

qvutc0">

 

హంగేరీ, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్, రొమానియాకు.. ఎమ్‌ఈఏ బృందాలు బయలుదేరాయి. ఆ అధికారులకు సంబంధిచిన వివరాలు, వాట్సాప్ నంబర్లను భారత విదేశాంగ శాఖ షేర్ చేసింది.

 

మోదీ సమీక్ష







 

రష్యా-ఉక్రెయిన్​ పరిణామాలపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. యుద్ధ పరిణామాలు, భారత్​పై తక్షణ ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమీక్షలో హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను ముఖ్యంగా విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చే విషయంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం 20 వేల మంది వరకు భారత పౌరులు ఉన్నారు. వీరందరినీ సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ ఈ ఆపరేషన్ చేపట్టింది.


రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న భీకర యుద్ధంపై ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ముప్పేట దాడి చేస్తోంది. రష్యా యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. భారత్ కూడా శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తోంది.


Also Read: Ukraine War Visuvals: ఉక్రెయిన్‌పై రష్యా ఎలా విరుచుకుపడుతుందో తెలుసా ? ఇవిగో దృశ్యాలు


Also Read: Ukraine War Telugu Students : ఉక్రెయిన్‌లో విద్యార్థుల వేదన - ఇక్కడ తల్లిదండ్రుల ఆవేదన ! తెలుగు రాష్ట్రాల్లోనూ యుద్ధ కల్లోలం..