రష్యా అత్యంత బలమైన సైనిక శక్తి కలది. రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ సామర్త్యం తక్కువే. ఇప్పుడు యుద్ధం ప్రారంభమయింది. కానీ ఉక్రెయిన్ లొంగిపోలేదు. ప్రతిఘటిస్తోంది. ఈ సందర్భంగా రష్యా -ఉక్రెయిన్ బలగాలమధ్య చోటు చేసుకుంటున్న యుద్ధం దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఓ చోట అతి తక్కువ ఎత్తులో రష్యా ఫైటర్ జెట్లు బాంబులు కురిపిస్తూంటే ఉక్రెయిన్ యుద్ధ విమానాలు వాటిని తరిమికొడుతున్న దృశ్యాలు కనించాయి.

  





 రష్యా బలగాలు బాంబు దాడులు కొనసాగిస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి.  ఒక్క సారిగా అంధకారం అయిన వైనం వైరల్ అవుతోంది. 





రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతోంది. దీపావళి పండుగల సమయంలో ఆకాశంలో ఎలా ఫైర్ క్రాకర్స్ కాలుస్తామో.. రష్యా అలా కాలుస్తోంది.


 





యుద్ధంలో ఉంటానో ఉండనో అని ఓ ఉక్రెయిన్ సైనికుడు తమ తల్లిదండ్రులకు గుడ్ చెబుతున్న వీడియో అందర్నీ కలిచి వేసేలా చేస్తోంది.





విమానాలు కూలడం.., యుద్ధ విమానాలు డ్యామేజ్ కావడం అంతా సినిమాలో సీన్లులా జరిగిపోతున్నాయి.


 





హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే నిప్పులు కురిపించే హెలికాఫ్టర్లు ఇప్పుడు అక్కడ ప్రజలకు రియల్‌గా కనిపిస్తున్నాయి. 


 





రష్యా దాడుల కారణంగా ఇప్పుడు ఉక్రెయిన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడివక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది.  


 





బాంబుదాడులు చేసిన తర్వాత ఆనవాళ్లు విషాదానికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.


 





ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఇళ్లపై యుద్ధ విమానాలు ఎగరడం ఇప్పుడు కామన్ అయిపోయింది. 





ఉక్రెయిన్ పై రష్యా  యుద్దం ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడుతోంది. అక్కడి ప్రజల్ని మరింతగా ఆందోళనకు గురిచేస్తోంది.