మలైకా అరోరా యాభై ఏళ్లకు దగ్గరపడుతున్నా అందం, ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తుంది. ఆమె వేసుకునే డ్రెస్సులు, తీసుకునే నిర్ణయాలు కూడా ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. తన కంటే చిన్న వయసు హీరో అర్జున్ కపూర్‌తో ఆమె సహజీవనం చేస్తుండడం ఇప్పటికే చాలా కాంట్రవర్సీ అయింది. ఆమె జిమ్ కు వేసుకెళ్లే దుస్తులు కూడా అంతే వివాదాస్పదంగానే ఉంటాయి. ఎక్స్‌పోజింగ్ చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు అమ్మడు. తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్ మళ్లీ తీవ్ర విమర్శల పాలైంది. వదులైన వైట్ షర్టు మీద, అంతే వదులైన స్వెట్టర్ వేసుకుని, హైహీల్ షూతో ముంబైలోని ఖర్ ప్రాంతానికి వచ్చారు. ఆమె కారు దిగి నడుస్తుంటే చుట్టూ ఉండే కెమెరాలు ఫోటోలు తీశాయి.వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు కొంతమంది. ఆ డ్రెస్సులో ఆమె ప్యాంటు వేసుకోలేదు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘ప్యాంటు ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చావా’ అంటూ కామెంట్లు చేశారు. కొంతమంది నెటిజన్లు మాత్రం ‘ఎవరి డ్రెస్ వారిష్టం,విమర్శించే హక్కు ఎవరికీ లేదు ’ అంటూ మద్దతుగా నిలిచారు. ఏదేమైనా మలైకా ఫ్యాషన్ ఐకాన్‌కు ఉదాహరణలా ఉంటుంది. ఎన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడిన ఆమె చలించదు.  


సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే వ్యక్తి మలైకా. యోగా సాధకురాలు. ఎప్పటికప్పుడు తన ఫోటోలను, యోగాసనాలను, వ్యక్తిగత విషయాలను ఇన్ స్టాలో పంచుకుంటూ ఉంటారు. సల్మాన్ ఖాన్ సోదరుడు  అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న మలైకా దాదాపు 18 ఏళ్ల తరువాత విడాకులు ఇచ్చింది. వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో కలిసుంటోంది. తెలుగులో అతిధి, గబ్బర్ సింగ్ సినిమాల్లో ఐటెం సాంగ్‌లలో నటించింది.