RSS chief Mohan Bhagwat: దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువులే: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్

ABP Desam Updated at: 16 Nov 2022 11:06 AM (IST)
Edited By: Murali Krishna

RSS chief Mohan Bhagwat: దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందూవులేనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువులే: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ ( Image Source : Getty )

NEXT PREV

RSS chief Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ  హిందువులేనని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సుర్గుజా జిల్లాలోని అంబికాపుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 







ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే హిందూత్వ సిద్ధాంతం. వేల సంవత్సరాలుగా భారత్‌ ఇదే భిన్నత్వాన్ని చాటుతోంది. 40 వేల సంవత్సరాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన అందరి డీఎన్‌ఏ ఒక్కటే. ప్రతిఒక్కరూ తమ సంస్కృతి, సంప్రదాయాలను తప్పక పాటించాలని పూర్వీకులు మనకు నేర్పించారు. భారత్‌ను తమ మాతృభూమిగా భావించి, ఇక్కడి భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతితో కలిసి జీవించాలనుకునేవారి కులం ఏదైనా,  ఏ మతాన్ని అనుసరిస్తున్నా, వారు మాట్లాడే భాష వేరైనా, ఆహారపు అలవాట్లు, సిద్ధాంతాల్లో వ్యత్యాసం ఉన్నా వారంతా హిందువులే. ఇదే విషయాన్ని 1925 నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోంది.                                                     -        మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్


గౌరవించాలి


దేశంలో ఇతర మతాలు, విశ్వాసాలు, సంప్రదాయాలను అందరూ గౌరవించాలని భగవత్ పిలుపునిచ్చారు. కరోనా సమయంలో దేశమంతా కలిసి పోరాడిందని గుర్తుచేశారు.



ఇతరుల విశ్వసాలు, సంప్రదాయాలను మనమంతా గౌరవించాలి. సొంత లక్ష్యాలను సాధించుకోవడం కోసం ఇతరుల సంపదను దోచుకోవద్దు. కరోనా సమయంలో దేశమంతా కలిసి పోరాడింది. సంస్కృతే అందర్ని ఒక్కటిగా చేస్తుందనేందుకు ఇదే నిదర్శనం.                                                     -        మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్


జనాభా విధానంపై


ఇటీవల నాగ్‌పుర్‌లో జరిగిన దసరా ర్యాలీలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. వర్గాల-ఆధారిత జనాభా అసమానత ఓ ప్రధాన అంశమని ఈ సందర్భంగా భగవత్ అన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదన్నారు. 


దేశంలో అన్ని వర్గాల వారికి వర్తించేలా ఓ సమగ్ర 'జనాభా విధానాన్ని' రూపొందించాలి. ఎందుకంటే దేశంలో వివిధ వర్గాల జనాభాలో సమతుల్యత ఉండాల్సిన అవసరం ఉంది. జనాభా అసమానతలు భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు దారి తీస్తాయి. కొన్ని వర్గాల్లో జనాభా సమతుల్యత లేని కారణంగా తూర్పు తైమూర్‌, కొసావో, దక్షిణ సూడాన్‌ వంటి కొత్త దేశాలు ఏర్పడ్డాయి.                                                     "


-  మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్

Also Read: Gujarat Polls 2022: రెబల్ నేతలను దారిలోకి తెచ్చేందుకు హోం మంత్రి అమిత్ షా కొత్త టెక్నిక్ 


 

Published at: 16 Nov 2022 11:01 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.