వాతావరణం చల్లబడతే చాలు సైనసైటిస్ రోగులకు ఇబ్బందులు మొదలవుతాయి. ఊపిరి అందక, జలుబు దగ్గుతో తీవ్రంగా బాధపడతారు. ముఖం కూడా నొప్పి పుడుతుంది. వాసనా, రుచి సరిగా తెలియవు. నోటి దుర్వాసన కూడా వేస్తుంది. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ ఆరోగ్య సమస్యను పెద్దగా పట్టించుకోరు చాలా మంది. 


అసలెందుకు వస్తుంది?
సైనసైటిస్ ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆరోచించారా? దీనికి కారణాలు అనేకం. వైరస్ లేదా ఫంగస్ చేరడం వల్ల సైనస్ లైనింగ్ ఉన్న కణజాలాలు వాస్తాయి. ఇన్ఫెక్షన్ గా మారిపోతుంది. అలాగే అలెర్జీల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ధూమపానం వల్ల కూడా సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. పొగాకు నుంచి వచ్చే పొగ ముక్కలోని మార్గాలను ఇబ్బంది పెడతుుంది. అలెర్జీగా మారి సైనసైటిస్ వస్తుంది. కాబట్టి ధూమపానాన్ని మానేయడం ఉత్తమం.    


లక్షణాలు ఎలా ఉంటాయి?
ఎంతో మంది సైనసైటిస్ ఉన్నప్పటికీ ఆ విషయం గుర్తుపెట్టలేరు. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం మీకు సైనస్ సమస్య ఉందేమో చెక్ చేసుకోవాలి. 
1. ఆకుపచ్చటి రంగులో ముక్క నుంచి స్రావం అవుతుంది. 
2. ముఖం భాగంలో కూడా నొప్పిగా అనిపిస్తుంది. 
3. గొంతు నొప్పిగా ఉంటుంది. 
4. తీవ్రమైన అలసటగా కూడా అనిపిస్తుంది. 
5. నోటి నుంచి దుర్వాసన వస్తుంది. 
6. శ్వాసతీసుకోవడం ఇబ్బంది అవుతుంది. 


చికిత్స ఎలా చేస్తారు?
సైనసైటిస్ దశను బట్టి చికిత్స ఉంటుంది. ముక్కు పక్కన ఉంటే సైనస్ భాగాలు స్రావంతో నిండిపోతే, ఆ స్రావాలను తీసివేస్తారు. యాంటీబయోటిక్స్ మందులు ఇస్తారు. అలెర్జీల కారణంగా వస్తున్నట్టు గమనిస్తే దానికి తగ్గ మాత్రలను సూచిస్తారు. 


Also read: శీతాకాలం చికెన్ సూప్ తాగితే ఆ వైరల్ ఇన్ఫెక్షన్లు అన్నీ దూరం, ఇలా చేసుకోండి





















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.