తెలుగిళ్లల్లో చికెన్ సూప్ కన్నాచికెన్ కూర వండుకుని తినేసే వాళ్లే ఎక్కువ. నిజానికి చికెన్ కూర కన్నా శీతాకాలంలో చికెన్ సూప్ తింటేనే చాలా ఆరోగ్యం. చల్లని సాయంత్రం వేళ వేడి వేడి చికెన్ సూప్ తింటే ఆ రుచే వేరు. వేడి సూప్ పొట్టలోకి చేరగానే శరీరానికి చాలా చురుకుదనంతో పాటూ ఉత్తేజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో చికెన్ సూప్ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి.  సూప్ మాత్రమే ఎందుకు?కూరగా,వేపుడుగా కాకుండా సూప్ రూపంలోనే తీసుకుంటే ఎందుకంత మేలు? శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సులువుగా వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు వెంటనే సోకుతాయి. ఇలాంటివి రాకుండా చికెన్ సూప్‌లోని గుణాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. 'కాపింగ్ విత్ అలర్జీస్ అండ్ ఆస్తమా' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం వెచ్చని చికెన్ సూప్ ముక్కు ద్వారా ఎలాంటి అలెర్జీ కారకాలు రాకుండా నిరోధించే సిలియా (ముక్కు వెంట్రుకలు) పనితీరును మెరుగుపరుస్తాయి.చికెన్ సూప్‌లోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఫ్లూకి వ్యతిరేకంగా నిరోధకతను పెంచుతాయి.చికెన్ సూప్‌లో ఉండే కార్నోసిన్ అనే సమ్మేళనం గొంతునొప్పి, దగ్గు, జలుబుని నయం చేయడంలో ముందుంటుంది. ఈ సమ్మేళనం తెల్ల రక్త కణాలు సమర్థంగా పనిచేసేలా చేసి ఇన్‌ఫ్లమ్మేషన్ రాకుండా తగ్గిస్తుంది. కోడి ఎముకలలో ఉండే జెలటిన్, గ్లూకోసమైన్, కొండ్రోయిటిన్ వంటివి సూప్‌ ద్వారా శరీరానికి చేరుతాయి. కోడి ఎముకలలో ఉండే అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు A, విటమిన్ K2, జింక్, ఐరన్, బోరాన్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ సూప్‌లో కరిగి శరీరంలో చేరుతాయి. 

టేస్టీ చికెన్ సూప్ ఎలా చేయాలో తెలుసుకోండి

కావాల్సిన పదార్థాలుఎముకలతో కూడిన చికెన్  - వందగ్రాములుదాల్చిన చెక్క - చిన్న ముక్కవెల్లుల్లి రెబ్బల తురుము - నాలుగుఅల్లం తురుము - అర స్పూనుఉల్లిపాయ - ఒకటిక్యారెట్ - అరకప్పుక్యాప్సికమ్ - అర కప్పుగ్రీన్ బీన్స్ - అరకప్పులవంగాలు - మూడుఉప్పు - రుచికి సరిపడాకార్న్ ఫ్లోర్  - రెండు స్పూన్లుమిరియాల పొడి - అర స్పూను

తయారీ ఇలా1. ముందుగా కుక్కర్లో చికెన్, దాల్చిన చెక్క, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్  బీన్స్, లవంగాలు, ఉప్పు వేసి మూడు నాలుగు విజిల్స్ దాకా ఉడికించాలి. 2. కుక్కర్ మూత తీసి చికెన్ ముక్కలను ఏరి ఓ ప్లేటులో  వేసుకోవాలి. ఎముకల చుట్టూ ఉండే మెత్తటి ముక్కలను తీసి పెట్టుకోవాలి. ఎముకలు పడేయాలి. 3. కుక్కర్లో మిగిలిని మిశ్రమాన్ని మళ్లీ స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అందులో చికెన్ మెత్తటి ముక్కలను వేసుకోవాలి. 4. మరుగుతున్నప్పుడు అర స్పూను మిరియాల పొడి వేసి కలపాలి. 5. చివర్లో కార్న్ ఫ్లోర్ నీటిలో కలిపి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. అప్పుడు సూప్ కాస్త చిక్కగా అవుతుంది. 

Also read: డెంగ్యూతో పోరాడుతున్నారా? ఇంట్లో తయారుచేసిన ఈ పానీయాలు తాగండి