Tesla Robot Attacks Engineer:



రోబో దాడి..


టెక్సాస్‌లోని టెస్లా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఓ రోబో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై దాడి (Robo Attacks Engineer) చేసింది. రోబోలో మాల్‌ఫంక్షనింగ్ కారణంగా ఉన్నట్టుండి రోబో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పదేపదే పొడవడం వల్ల తీవ్ర రక్తస్రావమైంది. నడుము,భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా ఉన్నట్టుండి ఈ ప్రాంతమంతా రక్తమయమైంది. అయితే...ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రమాదం జరిగి రెండేళ్లు దాటింది. ఇప్పుడు ఓ రిపోర్ట్‌ బయటపెడితే కానీ ఈ విషయం ఎవరికీ తెలియలేదు. ఈ రిపోర్ట్‌ ప్రకారం...ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ రోబోలు అల్యూమినియం కట్‌ చేసేలా ప్రోగ్రామింగ్ చేశాడు. రెండు రోబోలను మెయింటేనెన్స్ కారణంగా పక్కన పెట్టారు. మూడో రోబోని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఉన్నట్టుండి ఆ రోబో వింతగా ప్రవర్తించింది. ఇచ్చిన కమాండ్స్‌కి సంబంధం లేకుండా దాడి చేసింది. ఈ దాడిలో ఆ ఇంజనీర్‌ ఎడమ చేతికి బాగా గాయమైంది. దీనిపై టెస్లా మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. 2021 లేదా 2022లో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా తెలుస్తోంది. భద్రతాపరమైన ప్రమాణాలు పాటించడంలో టెస్లా నిర్లక్ష్యం వహిస్తోందని కొందరు వాదిస్తున్నారు. ఈ చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే టెస్లా ఈ ఘటనపై నోరు విప్పడం లేదు. మరో ఆందోళనకర విషయం ఏంటంటే...గతేడాది దాదాపు 21 మందిపై ఇలాగే రోబోలు దాడి చేసినట్టు సమాచారం. కొందరు టెస్లా ఉద్యోగులు ఇప్పటికే ఈ ఘటనలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెయింటేనెన్స్‌తో పాటు మరే విషయంలోనూ టెస్లా సరైన విధంగా పట్టించుకోవడం లేదని మండి పడుతున్నారు. తమను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని విమర్శిస్తున్నారు. 


భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు టెస్లా (Tesla in India Market) ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. భారత్‌ కూడా అందుకు సానుకూలంగానే ఉన్నప్పటికీ Import Tax విషయంలో రాజీ కుదరడం లేదు. ఈ ట్యాక్స్‌ని తగ్గించాలని టెస్లా ప్రతిపాదించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చాలా రోజులుగా దీనిపై చర్చ జరిగింది. ఇన్నాళ్లకు అధికారికంగా ఓ ప్రకటన చేసింది. దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలపై ఇంపోర్ట్ ట్యాక్స్ (Import Tax on Tesla Vehicles)తగ్గించే ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇండియన్ మార్కెట్‌లో పాగా వేయాలని చూస్తున్న టెస్లాకి ఇది ఊహించని షాక్. పార్లమెంట్‌లో ఈ ప్రస్తావన రాగా..లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు వాణిజ్యశాఖ మంత్రి సోమ్ ప్రకాశ్. దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలపై వేసే ట్యాక్స్ విషయంలో ఎలాంటి సబ్సిడీలు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.


"దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలపై దిగుమతి పన్నులో సబ్సిడీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లోకల్ వాల్యూ అడిషన్‌కే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే GST అమల్లోకి తీసుకొచ్చింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల్ని సవరించింది"


- సోమ్ ప్రకాశ్, వాణిజ్య మంత్రి


Also Read: Putin Wishes PM Modi: నా మిత్రుడు మరోసారి గెలవాలి,ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ విషెస్