CM Revanth Reddy in Telangana Secretariat: తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర సచివాలయానికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం కాన్వాయ్‌లో సెక్రటేరియట్‌కు వచ్చిన రేవంత్ కు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో పోలీసులు రేవంత్ రెడ్డికి గౌరవ వందనం సమర్పించారు. లోనికి వెళ్లిన సీఎస్, డీజీపీతో సెక్రటేరియట్ లోనికి వెళ్లిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఛాంబర్ ఉన్న ఆరో అంతస్తుకు వెళ్లే ముందు పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. 



ఆ తర్వాత కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది మంత్రులు కూడా చేరుకున్నారు. మంత్రులుగా మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వరుసగా ప్రమాణం చేశారు. వీరిలో డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితో కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.


సాయంత్రం 4.20 గంటలకు సచివాలయం చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రధాన ద్వారం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాలతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘనంగా  స్వాగతం పలికారు.  పోలీస్ అధికార బ్యాండ్ తో స్వాగతం పలికిన అనంతరం, ప్రధాన ద్వారం వద్ద నుండి కాలినడకన సాయంత్రం 4.30  నిమిషాలకు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకొన్నారు. కార్యాలయం లోపలికి ప్రవేశించగానే... వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సి.ఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో తన శ్రీమతి గీతతో కలసి పూజలు నిర్వహించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సాయంత్రం 4.46 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి తన అధికార కుర్చీలో ఆసీనులయ్యారు. అనంతరం వేద పండితులు సీఎం దంపతులకు ఆశీర్వచనం చేశారు.  


ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, పొన్నం ప్రభాకర్,  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా లతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సెక్రటేరియట్ అధికారులు, ప్రజాప్రతిధులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది.


కేబినెట్ నిర్ణయాలు ఇవే..


తెలంగాణ కేబినెట్ సమావేశంలో (Telangana Cabinet Desicions) తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాల గురించి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వివరించారు. తాము ఎన్నికలకు ముందు ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం ఈ మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించామని వివరించారు. అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ మొదటి కేబినెట్‌లో రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రేపు మళ్లీ ఈ రెండు గ్యారంటీలపై సుదీర్ఘంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులతో చర్చించి డిసెంబరు 9న వాటిని మొదలు పెడతామని (Minister Sridhar Babu Press Meet) అన్నారు. ఇంకా చదవండి