Retired husband to pay 60 percent pension income to divorced wife : రిటైర్డ్ భర్త 60 శాతం పెన్షన్‌ను విడాకులు తీసుకున్న భార్యకు భరణంగా చెల్లించాలని కోల్ కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక రిటైర్డ్ భర్త తన విడాకులు తీసుకున్న భార్యకు భరణం (మెయింటెనెన్స్) చెల్లించే విషయంలో పునంపరిశీలించాలని కోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఈ వాదనను తిరస్కరించి, అతను తన పెన్షన్ ఆదాయంలో 60 శాతం భరణంగా చెల్లించాలని ఆదేశించింది. అంతే కాదు ప్రతి రెండు ఏళ్లకు ఓ సారి ఐదుశాతం పెంచాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ భర్త, UCO బ్యాంక్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగం నుండి రిటైర్ అయిన వ్యక్తి. తన విడాకుల సమయంలో నెలకు 1.3 లక్షల రూపాయల జీతం సంపాదిస్తున్నాడు. రిటైర్మెంట్ తర్వాత అతని ఆదాయం నెలకు 42,000 రూపాయల పెన్షన్‌కు తగ్గింది. తగ్గిన ఆదాయం కారణంగా భరణం చెల్లించలేనని, తనకు కొత్త కుటుంబం , వృద్ధ తల్లిదండ్రులను సంరక్షించే బాధ్యతలు ఉన్నాయని వాదించాడు. అయితే హైకోర్టు భర్తను నెలకు 25,000 రూపాయలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. ఇది అతని పెన్షన్ ఆదాయంలో సుమారు 60 శాతం.
సుప్రీం కోర్టు ఇటీవలి తీర్పులను సూచిస్తూ, భరణం నిర్ణయించేటప్పుడు భ క్క ప్రస్తుత ఆదాయం మాత్రమే కాకుండా, అతని గత సంపాదన, ఆస్తులు,ఇతర ఆదాయ సామర్థ్యాన్ని కూడా పరిగణించాలని హైకోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు గతంలో భరణం భార్యకు వివాహ సమయంలో ఆమె వన ప్రమాణాలను ప్రతిబింబించాలని స్పష్టం చేసింది. ఇది భార్య సామాజిక, ఆర్థిక స్థితి, ఆమె అవసరాలు, భర్త ఆర్థిక సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఆదాయం తక్కువగా చూపించడం లేదా ఆర్థిక సామర్థ్యాన్ని దాచడం వంటి వ్యూహాత్మక ప్రయత్నాలను నిరోధించడానికి కోర్టులు టాక్స్ రిటర్న్‌లను మాత్రమే ఆధారం చేసుకోవు. ఇతర ఆదాయ వనరులు మరియు ఆస్తులను కూడా పరిశీలిస్తాయి.
భర్తలు తమ ఆదాయాన్ని తక్కువగా చూపించడం ద్వారా భరణ బాధ్యతలను తప్పించుకోలేరని ఈ తీర్పు స్పష్టం చేసింది. కోర్టులు ఆదాయ టాక్స్ రిటర్న్‌లను మించి ఆదాయ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ తీర్పుపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.