Republic Day Celebrations 2024: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో (Republic Day 2024) ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన తలపాగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇలాంటి కీలక వేడుకలున్న ప్రతిసారీ ఆయన ఏదో ఓ ప్రత్యేకమైన దుస్తుల్ని ధరిస్తారు. ఈసారి రాజస్థాన్‌ సంస్కృతిలో కనిపించే Bandhani తలపాగాతో కనిపించారు. రిపబ్లిక్ డే పరేడ్‌కి రాకముందు ఆయన నేషనల్ వార్ మెమోరియల్‌ని సందర్శించారు. ఆ సమయంలోనే ఆయన ఈ తలపాగాతో కనిపించారు. తెల్లని కుర్తా, ప్యాంట్‌తో పాటు బ్రౌన్ కలర్ కోట్‌ ధరించారు. కానీ ఆయన ధరించిన తలపాగా మాత్రం హైలైట్‌గా నిలిచింది. రాజస్థాన్‌కి మాత్రమే చెందిన అరుదైన Turban ఇది. ఈ బంధనిని బంధేజ్‌ (Bandhej) అని కూడా పిలుస్తారు. ఎన్నో శతాబ్దాలుగా ఇది అక్కడి సంస్కృతిలో భాగమైపోయింది. ఆరో శతాబ్దంలోనే గుజరాత్‌లోని అజ్రక్‌పూర్‌లో తొలిసారి ఈ తలపాగాను తయారు చేసి ధరించడం మొదలు పెట్టిన చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బంధనీ అనే పేరు సంస్కృత పదమైన Bandhana నుంచి వచ్చింది. అంటే...కట్టి ఉంచడం. తలకు చుట్టుకునేది, కట్టుకునేది కాబట్టి దానికా పేరు పెట్టారు. 7వ శతాబ్దం నాటికి గుజరాత్‌లో ఇది చాలా పాపులర్ అయింది. 






ఫ్యాబ్రిక్‌పై అందంగా రంగులద్దే ఈ కళ పర్షియన్ వ్యాపారుల ద్వారా ఇక్కడికి దిగుమతైంది. ఖత్రీ కమ్యూనిటీకి చెందిన వాళ్లు ఈ తలపాగాని ధరించడం అలవాటు చేసుకున్నారు. దాన్ని ఓ హోదాగా భావించారు. మొఘల్ పరిపాలన నుంచీ ఈ తలపాగాలకు మంచి డిమాండ్ ఉంది. పురుషులతో పాటు మహిళలూ వీటిని ధరించేందుకు ఆసక్తి చూపిస్తారు. బంధని తలపాగాకు ఓ యునిక్ స్టైల్ ఉంది. కచ్‌, గుజరాత్‌లోని ఈ తలపాగాలతో పోల్చి చూస్తే రాజస్థాన్‌ తలపాగాలకు చాలా తేడాలు కనిపిస్తాయి. రంగులు అద్దడం నుంచి తయారు చేసే విధానం వరకూ అన్నీ వేరుగా ఉంటాయి. యూపీలోనూ కొన్ని చోట్ల ఈ తలపాగాని ధరించే సంప్రదాయం కనిపిస్తుంది. ఇదే స్టైల్‌లో తలపాగాలతో పాటు చీరలూ నేస్తారు. ముందుగా ఈ తెల్లని ఫ్యాబ్రిక్‌ని గట్టిగా చుడతారు. రకరకాల డిజైన్స్‌తో వాటిని చుట్టి పెడతారు. ఆ తరవాత దానిపై రంగులు వేస్తారు. కానీ...ఆ రంగుల్ని ఆ తెల్లని క్లాత్‌ అప్పుడే అబ్జార్బ్ చేసుకోదు. వాటిని రెండు రోజుల పాటు ఎండబెట్టాల్సి ఉంటుంది. డై వేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది. ఈ ఫ్యాబ్రిక్‌తో చీరలతో పాటు సల్వార్‌లూ తయారు చేస్తున్నారు. గతేడాది రిపబ్లిక్ డే వేడుకల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రత్యేక టోపీని ధరించారు. ఉత్తరాఖండ్‌కి చెందిన ఈ టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంటుంది. ఇది ఉత్తరాఖండ్‌కి నేషనల్ ఫ్లవర్. కేదార్‌నాథ్‌లో పూజలు నిర్వహించిన ప్రతిసారీ ప్రధాని మోదీ ఈ పూలే వినియోగిస్తారు. 


Also Read: Republic Day 2024: రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీశక్తి, ప్రత్యేక ఆకర్షణగా మహిళల బ్యాండ్