Republic Day Parade 2024: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో పరేడ్ నిర్వహించారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్‌ని సందర్శించారు. ఆ తరవాత ముఖ్యఅతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో కలిసి పరేడ్‌కి హాజరయ్యారు. ఈ సారి పరేడ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది. తొలిసారి ఈ పరేడ్‌లో నారీశక్తి  కనిపించింది. త్రివిధ దళాలకు చెందిన మహిళలు పరేడ్‌లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన 15 మంది మహిళా పైలట్‌లతో పాటు Central Armed Police Forces (CAPF)కి చెందిన మహిళలూ పరేడ్ నిర్వహించారు. మొత్తం పరేడ్‌లో ఇదే హైలైట్‌గా నిలిచింది.





వీళ్లతో పాటు 100 మంది మహిళా కళాకారులు వాద్యాలు వాయించారు. శంఖం, నాదస్వరం లాంటి వాద్యాలు వాయిస్తూ పరేడ్ నిర్వహించారు. మిలిటరీ బ్యాండ్స్‌తో కాకుండా ఇలా పరేడ్ చేయడం ఇదే తొలిసారి.