రిపబ్లిక్ డే వేడుకకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాదితో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా వాయుసేన ప్రత్యేక విన్యాసాలకు రెడీ అవుతోంది. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలలో భాగంగా 75 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో విన్యాసాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలానే కరోనా నిబంధనలను కూడా పక్కాగా అమలు చేస్తామని వాయుసేన పేర్కొంది.







విన్యాసాలు ఇవే..



  • వాయుసేన చేపట్టే విన్యాసాల్లో రఫేల్‌, జాగ్వార్‌, మిగ్‌-29, చినూక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గొంటాయి.

  • స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోన్న సందర్భంగా  17 జాగ్వార్ విమానాలు 75 సంఖ్య వచ్చేలా విన్యాసాలు చేస్తాయి.

  • ఎంఐ 17 ఎయిర్​క్రాఫ్ట్​లు ధ్వజ్ ఫార్మేషన్​తో విన్యాసాలు చేయనున్నాయి.

  • వినాశ్ ఫార్మేషన్​లో ఐదు రఫేల్ యుద్ధవిమానాలు రాజ్​పథ్ మీదుగా దూసుకు వెళ్లనున్నట్లు వాయుసేన వెల్లడించింది.

  • నేవీకి చెందిన మిగ్29కే, పీ8ఐ నిఘా విమానం వరుణ ఆకృతిలో విన్యాసాలు చేయనున్నాయి. 


భారీ భద్రత..


మరోవైపు దేశంలో సెక్యూరిటీ ఏజెన్సీలు, బలగాలు హైఅలర్ట్‌లో ఉన్నాయి. రిపబ్లిక్ డే నాడు భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందటంతో అప్రమత్తం అయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో భద్రతను పెంచాలని ఇప్పటికే బలగాలకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.


భద్రతా బలగాలకు వచ్చిన సమాచారం ప్రకారం.. హై ప్రొఫైల్ లీడర్లతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాలు, మార్కెట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లు, ఆధ్యాత్మిక ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. 


దీంతో ముఖ్యంగా యూనిట్ కంట్రోల్ రూమ్‌లు 24/7 అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. నిఘా వర్గాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుని సివిల్ పోలీసులకు అందించాలని పేర్కొంది. 


భద్రతా బలగాలతో పాటు మిలిటరీ సిబ్బంది కూాడా అప్రమత్తంగా ఉండాలని.. క్యాంప్ ఏరియాల్లో కూడా నిరంతర పర్యవేక్షణ చేయాలని సదరు నోటీసులో ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం. 


Also Read: Covid Vaccine for Children: గుడ్‌న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!


Also Read: Omicron Cases: భారత్‌లో కాస్త శాంతించిన కరోనా మహమ్మారి.. మరోవైపు 8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి