Ratan Tata Prayer Meet Saw Parsi, Muslim, Christian, Sikh And Hindu Priests : రతన్ టాటా  మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలు ఏ పద్దతిలో జరుపుతారన్న దానిపై విస్తృత చర్చ జరిగింది. దీనికి కారణం టాటాలు పార్శీ వర్గానికి చెందిన వారు. అయితే రతన్ టాటా ఇలాంటి వర్గాలకు అతీతం. కుల, మతాలను ఆయన ఎప్పుడూ చూడలేదు. ఆ విషయం అంత్యక్రియల్లోనూ వెల్లడి  అయింది. ఆయన పార్దీవ దేశం వద్ద పార్శీ, మస్లిం, క్రిస్టియన్ , సిఖ్ అలాగే హిందూ మతాలకు చెందిన వారు ప్రార్థనలు చేస్తూ కనిపించారు.  






 


రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లియా- ఎవరు ఎందులో గొప్ప!


సాధారణంగా చనిపోతే ఎవరికి ఎవరి తమ విశ్వాసాలకు అనుగుణంగా వారు మత పెద్దలను పిలిపించుకుని ప్రార్థనలు చేస్తారు. అయితే రతన్ టాటా అసలైన విశ్వమానవుడు కాబట్టి ఆయనను ఒక్క మతానికి  పరిమితం చేయడం కరెక్ట్ కాదని అందరూ భావిస్తారు. దానికి తగ్గట్లుగానే అన్న మతాల  మత పెద్దలు వచ్చి టాటా పార్ధీవదేహం పక్కన నిలబడి తమ తమ మతాల ప్రార్థనలు చేశారు. ఇది అందరి గుండెలను బరువెక్కేలా చేసింది.  





న్యూ ఐడియాల స్టార్టప్‌లకు బూస్టర్‌- మధ్యతరగతి ప్రజల సేవియర్ రతన్ టాటా


రతన్ టాటాకు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, వీఐపీలు ముంబైకి తరలి వచ్చారు రతన్ టాటా ఒక్క వ్యాపారవేత్తంగానే కాకుండా సేవతత్పరతో చాలా దేశ ప్రజల మన్ననలు పొందారు. అందుకే ఆయన లేరనే వార్త తెలిసిన తర్వాత అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  ఆయన తెలివితేటలు, కృషి పట్టుదలతో టాటా గ్రూప్‌ను ప్రపంచస్థాయి వ్యాపార సంస్థగా మార్చారు. సామాన్యుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వారి మనస్సులో చెరగని ముద్రవేసుకున్నారు. 


గుండుసూది నుంచి విమానాల వరకు అన్ని రంగాలకు టాటా సామ్రాజ్యాన్ని విస్తరించారు రతన్‌ టాటా. ఆయన పెళ్లి చేసుకోలేదు.   ముంబైలోని  చిన్న ఇంట్లో అతి సాదాసీదాగానే నివరించారు.  . మీడియా ప్రచారానికి దూరంగా ఉండేవారు. తనతోపాటు పుస్తకాలను, సీడీలను, పెంపుడు కుక్కలతో గడిపేవారు.