Rashtriya Rajput Karnisena Chief Killed in Jaipur: రాష్ట్రీయ రాజపుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ గోగమేడి (Sukhdev Singh Gogamedi) దారుణ హత్యకు గురయ్యారు. రాజస్థాన్ జైపూర్ (Jaipur) లోని శ్యామ్ నగర్ (Shyam Nagar) లో ఆయన ఇంట్లో ఉండగా మంగళవారం దుండగులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఆయన భద్రతా సిబ్బంది, మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సుఖ్ దేవ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టామని జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆయన హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొనగా, ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఇదీ చూడండి: Heavy Rains in Chennai due to Michaung Cyclone: మిగ్ జాం ఎఫెక్ట్ - చెన్నై నగరం అతలాకుతలం, 8 మంది మృతి