ACB Court :  టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు జైల్లో ఉండగానే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని సీఐడీ వారెంట్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ప్రస్తుతం చంద్రబాబు బెయిల్‌పై బయట ఉన్నందున వారెంట్లకు విచారణ అర్హత లేదని తోసిపుచ్చింది. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖౌదీగా ఉన్నప్పుడు ఏపీ సీఐడీ అధికారులు పీటీ వారెంట్లు దాఖలు చేశారు.  ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో ఏపీ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేసింది. వాటిపై పలుమార్లు విచారణ జరిగింది. ఈ సందర్భంగా  చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్‌పై ఉన్నారు కాబట్టి పీటీ వారెంట్లు నిరర్దకమవుతాయని విజయవాడ ఏసీబీ కోర్టు  తోసిపుచ్చింది.


చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో అరెస్టు చేసిన తర్వాత  ఆయనకు బెయిల్ వస్తుందేమోనన్న ఉద్దేశంతో ఇతర కేసుల్లో అరెస్టు చూపించేందుకు పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఏవరైనా జైల్లో ఉన్నప్పుడు మరో కేసులో విచారించడానికి అరెస్టు చూపించడానికి పీటీ వారెంట్లను ఉపయోగించుకుంటారు. అయితే ఈ పీటీ వాలెంట్లపై విచారమ సుదీర్ఘంగా సాగింది. తనపై నమోదు చేసిన కేసులన్నీ చట్ట వ్యతిరేకమని చంద్రబాబు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైతీర్పు రావాల్సి ఉంది. ఈ లోపు ఆయనకు మొదట ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్.. తర్వాత స్కిల్ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేనందున రెగ్యులర్ బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.                      


సుప్రీంకోర్టులో తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.   మరో చంద్రబాబు డిసెంబర్ 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓట్ల విషయంలో వైసీపీ నేతల అక్రమాలకు పాల్పడుతున్నారని సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. ఢిల్లీ పర్యటన పూర్తి పూర్తయ్యాక తిరిగి వచ్చి జిల్లాల్లో పర్యటించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 11న శ్రీకాకుళం, 12న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. వైసీపీ పాలనలో సర్పంచ్‌లకు జరుగుతున్న అన్యాయం.. స్థానిక సంస్థల ప్రతినిధుల్ని.. వ్యవస్థల్ని  ఎలా నిర్వీర్యం చేశారో వివరించనున్నారు. పంచాయతీల నిధులను స్వాహా చేయడంపైనా పోరు బాట పట్టనున్నారు.                                


చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ ఆందోళనలు ... ప్రజా సమస్యలపై కాకుండా చంద్రబాబు అరెస్టు అంశంపైనే సాగాయి. ఇప్పుడు రూటు మార్చుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల్లోకి వెళ్తున్నారు.  సుప్రీంకోర్టులోనూ ఊరట లభిస్తుందన్న నమ్మకంతో టీడీపీ వర్గాలు ఉన్నాయి.