Prema Entha Madhuram Today Episode : ఈరోజు ఎపిసోడ్ లో తనని చూసి దాక్కున్న అనుతో నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు నా ముందుకి రా అని పిలుస్తాడు ఆర్య.


అను: ఆర్యకి కనిపించకుండా దాక్కొని, ఆర్యని చూస్తూ నేను మీకు కనిపించలేను, నా మొహం మీకు చూపించలేను అని మనసులో అనుకుంటుంది.


ఆర్య: నాకు ఏమైనా అయిపోతుందనే భయంతోనే కదా నువ్వు దాక్కుంటున్నావు అదంతా అబద్ధం, జోగమ్మ అబద్ధం ఇదంతా మాన్సీ కుట్ర అని గట్టిగా అరుస్తాడు.


అయితే అప్పుడే రౌడీలకి ఆర్య కనిపిస్తాడు. అతనిని రౌడీలు రౌండ్ అప్ చేస్తారు. ఒక రౌడీ వీడియో కాల్​లో జరిగినదంతా మాన్సీ వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. అందులో ఒక రౌడీ కత్తి తీసి ఆర్య మీదికి వస్తూ ఉండడం గమనించిన అను కత్తిపోటుకి ఎదురుగా వెళ్తుంది. కత్తిపోటుకి గురైన అనుని చూసి కంగారు పడతాడు ఆర్య. ఆమెని పట్టుకునేలోపు వెనకనుంచి మరొక రౌడీ వచ్చి ఆర్యని కూడా పొడిచేస్తాడు. ఇద్దరూ అక్కడే  స్పృహ  కోల్పోతారు.


మరోవైపు తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కి, అభయ్.


సుగుణ: ఇప్పటికే లేట్ అయింది భోజనం చేద్దురుగాని రండి అని పిల్లల్ని పిలుస్తుంది.


పిల్లలు: అమ్మ వచ్చాక భోజనం చేస్తాము అమ్మ ఇంకా రాలేదేమిటి అని అడుగుతారు.


ఉష: గుడికి వెళ్లి అట్నుంచటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అంది అని చెప్తుంది.


అయినా పిల్లలిద్దరూ మూడీగా ఉండటం చూసి వాళ్లని ఆడించడానికి తీసుకెళ్తుంది ఉష.


మరోవైపు అను దంపతులని అంబులెన్స్​లో ఆస్పత్రిలో జాయిన్ చేస్తారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అను, ఆర్య. మరోవైపు అక్కి కోసం పాలు తీసుకువస్తుంది సుగుణ.


సుగుణ: అప్పటికే పడుకున్న అక్కిని చూసి అయ్యో అప్పుడే నిద్రపోయిందా.. తనకోసం పాలు తీసుకువచ్చాను.


అభయ్: చెల్లికి నిద్ర వస్తే అస్సలు ఆపుకోలేదు. రోజు అమ్మ ఒడిలో పడుకొని నిద్ర పోతుంది.. అందుకే ఈరోజు నా ఒడిలో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చాను. అయినా ఇంకా అమ్మ రాలేదేంటి నానమ్మ..


సుగుణ: ఒకసారి రాధకి ఫోన్ చెయ్యమ్మ ఇప్పటికే బాగా లేట్ అయింది అని ఉషకి చెప్తుంది.


ఫోన్ చేసిన ఉష లైన్ కలవట్లేదు అని చెప్తుంది. ఇంతలో అక్కి ఉలిక్కిపడి లేస్తుంది. అమ్మ కావాలి అని ఏడుస్తుంది.


అభయ్ : చెల్లికి పిడుగులు అంటే భయం నానమ్మ.


సుగుణ: భయపడకు నేను, ఉష అక్క, అన్నయ్య అందరం ఉన్నాం కదా అని అక్కికి ధైర్యం చెప్తుంది. అయినా అక్కి ఊరుకోకుండా అమ్మ కావాలి అని ఏడుస్తుంది.


మరోవైపు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆర్యకి జరిగిందంతా గుర్తుకు వస్తుంది. వెంటనే తనకి అమర్చిన సెలైన్లు పైపులు అన్ని తీసేసి రక్తం వస్తున్నా కూడా అనుని వెతకటానికి బయలుదేరుతాడు. ప్రతి రూము చెక్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సిస్టర్ వచ్చి మీరు ఇలా నడవకూడదు స్ట్రిచెస్ మీద ప్రెజర్ పడకూడదు అని వీల్ చైర్ తెప్పిస్తుంది. అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి ఈయన్ని ఎందుకు ఇలా వదిలేసావు అని సిస్టర్​ని మందలిస్తాడు.


ఆర్య: లేదు డాక్టర్ నాతోపాటు నా భార్య వచ్చింది కదా తనని చూడాలి అంటాడు.


డాక్టర్ ఆర్య మాటలు పట్టించుకోకుండా ముందు ట్రీట్మెంట్ కానివ్వండి అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. మరోవైపు ఆర్య వాళ్ళని కత్తితో పొడవడం ఫోన్లో చూసి.. ఆనందంగా పండగ చేసుకుంటూ ఉంటారు ఛాయదేవి, మాన్సీ.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.