KCR Vacate Delhi House :   ప్రగతి భవన్ ను ఖాళీ చేస్తున్న  తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేస్తున్నారు. ముఖ్యమంత్రులకు ఢిల్లీలో ఓ అధికారిక నివాసం కేటాయిస్తారు. ఎంపీగా ఉన్నప్పుడు కేటాయించిన ఇంటినే.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగిస్తున్ారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా రాజీనామా చేసినందున ఆ ఇంటిని పార్లమెంట్ కు అప్పగించాల్సి ఉంది. 

  
ఢిల్లీకి  ఎప్పుడు వెళ్లినా తుగ్లక్ లైన్‌లోని ఇంట్లో కేసీఆర్  ఉంటారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత కవిత  కూడా ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా ఆ ఇంట్లోనే ఉంటారు. రెండు దశాబ్దాలుగా దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసంగా ఉంి.  2004 నుండి ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లోని ఇల్లు అప్పట్లో కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పటి నుండి అధికారిక నివాసంగా ఉంది. ఆ తర్వాత సీఎంగా ఉన్న సమయంలో ఆ ఇంటిని అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.  


రాష్ట్రంలో గెలిచిన తర్వాత కేసీఆర్ రెండు సార్లు  ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎం హోదాలో హస్తినకు వచ్చినప్పుడల్లార తుగ్లక్ లేన్ లోని  ఇంట్లోనే ఉండేవారు. అధికారం కోల్పోయిన ఏ ప్రజాప్రతినిధి అయినా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి ఒక నెల సమయం ఉంటుంది. కానీ, కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు మూడు రోజుల్లో ఇల్లు పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆ ఇల్లు ఖాళీగా ఉంటే రెండు దశాబ్దాలుగా ఈ ఇంటితో కేసీఆర్‌కు ఉన్న సంబంధం తెగిపోతుంది. 2004లో టీఆర్‌ఎస్‌ తరఫున కరీంనగర్‌ నుంచి ఎంపీగా ఎన్నికై మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్‌ పనిచేశారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు తుగ్లక్ రోడ్డులోని టైప్ 8 క్వార్టర్‌ను కేటాయించింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచి అదే సభలో కొనసాగారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన అదే నివాసంలో ఉంటున్నారు.


2014లో తెలంగాణ సీఎం అయిన కేసీఆర్.. ముఖ్యమంత్రులకు ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా అదే నివాసాన్ని కేసీఆర్ కు కేటాయించారు. అదే సమయంలో కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఆమె ఆ నివాసాన్ని తన అధికారిక నివాసంగా కూడా ఎంచుకుంది. ఆ క్వార్టర్ ముఖ్యమంత్రి, ఎంపీ కవితకు అధికారిక నివాసంగా మారింది. 2018లో కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత అదే నివాసంలో కొనసాగారు. 


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతున్న సమయంలో కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక భవనాలను ఖాళీ చేయాల్సిందే. ఇప్పటికే పలువురు మంత్రులు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారిక భవనాలను ఖాళీ చేస్తున్నారు. క్యాంపు కార్యాలయాల్లోనే తమ సామాగ్రిని తరలిస్తున్నారు. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను కూడా కేసీఆర్ ఖాళీ చేస్తున్నారు.