మహిళలకు రాజస్తాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రక్షాబంధన్ టైంలో మహిళను సర్‌ప్రైజ్ చేసింది. ఆగస్టు22న ప్రయాణాలు చేసే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చని చెప్పింది. 


రాజస్తాన్ రోడ్‌వేస్‌ నడిపే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఆగస్టు 22 రకాబంధన్ రోజున మహిళలంతా ఫ్రీగా తిరగొచ్చు. దీనిపై రూల్స్‌ ఫ్రేమ్ చేసి  అధికారిక ఉత్తర్వులను రాజస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. 




రాజస్తాన్ వ్యాప్తంగా నడిచే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. ఈ రెండు రకాల సర్వీస్‌ల్లో మాత్రమే ప్రయాణించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వేరే సర్వీస్‌లో ఉచితంగా తిరిగే వీల్లేదని ఉత్తర్వుల్లో పేర్కొొంది. ఏసీ, వోల్వో, ఆల్ ఇండియా పర్మిట్ ఉన్న బస్సులకు ఉచిత ప్రయాణ సదుపాయం వర్తించదని తేల్చి చెప్పింది ప్రభుత్వం.  


రాఖీ పౌర్ణమి రోజున చాలా మంది మహిళలు... రాఖీలు కట్టేందుకు తమ సోదరుల ఇంటికి వెళ్తుంటారు. అలాంటి వారికి సౌకర్యంగా ఉంటుందని..రక్షాబంధన్ కానుక ప్రకటించినట్టు రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. ఇలాంటివే కాకుండా మహిళల రక్షణకు తమ ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశ పెడుతోందని... భవిష్యత్‌లోనూ ఇలాంటి మరెన్నో స్కీమ్స్ తీసుకొస్తామన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి  అశోక్‌ గెల్హాట్. 


రాఖీ పౌర్ణమి... భారతీయుల్లో చాలా మందికి అత్యంత ఇష్టమైన పండుగ. రక్షాబంధన్ పండుగను శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దీనిని జరుపుకుంటారు. దీనినే రాఖీ పండుగ అని కూడా అంటారు. సోదరి, సోదరుల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగ జరుపుకుంటారు.