School Management Not allowed Girl Child who Wear Ayyappa Mala: రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్ (Rajendra Nagar) బండ్లగూడలో (Bandlagooda) ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. అయ్యప్ప మాల వేసుకున్న ఓ చిన్నారిని లోపలికి అనుమతించలేదు. స్కూల్ డ్రెస్ లోనే రావాలని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో సదరు బాలిక గంట పాటు బయట ఎండలోనే నిలబడాల్సి వచ్చింది. దీనిపై తండ్రికి సమాచారం ఇవ్వగా, తన కుమార్తెను ఎందుకు లోపలికి రానివ్వరు అంటూ అతను పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. స్కూల్ డ్రెస్ ఉంటేనే అనుమతిస్తామని, అయ్యప్ప మాల ఆ డ్రెస్ లో ఉంటే అనుమతించమని స్పష్టం చేసింది. దీనిపై బాలిక తండ్రి ఆందోళనకు దిగారు. ఈ తతంగాన్ని మొబైల్ లో రికార్డు చేయడానికి యత్నించగా, ఈ రికార్డింగులు స్కూల్ లో చెల్లవంటూ స్కూల్ యాజమాన్యం బెదిరింపులకు దిగినట్లు బాలిక తండ్రి ఆరోపించారు.






Also Read: MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!