Rajasthan Politics : రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. సీఎం అశోక్ గెహ్లాట్, ,మరో సీనియర్ సచిన్ పైలట్ మధ్య రాజకీయ వివాదాలు తీవ్రంగా మారాయి. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో అశోక్ గెహ్లాట్ భేటీ కానున్నారు. ఆ తర్వాత విడిగా సచిన్ పైలట్ కూడా సమావేశం కానున్నారని తెలుస్తోంది. తాను చేసిన మూడు ప్రధానమైన డిమాండ్లను ఈనెలాఖరులోపు పరిష్కరించకుంటే రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించిన సచిల్ పైలెట్.. అశోక్ గెహ్లాట్ సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు.
మణిపూర్ కు వెళ్లిన అమిత్ షా - హింసాత్మక ఘర్షణలను చక్కదిద్దుతారా?
సచిన్ పైలట్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఐదురోజులపాటు పాదయాత్ర చేశారు. తమది కూడా 40శాతం కమీషన్ ప్రభుత్వమేనని రాజస్థాన్‌లో గెహ్లాట్ కూడా 40 శాతం కమీషన్ సర్కార్ నడిపిస్తున్నారని పైలట్ వర్గానికి చెందిన ఓ మంత్రి చేసిన ఆరోపణ సంచలనం అయింది. కమీషన్ అప్పజెప్పనిదే ఫైళ్లు ముందుకు కదలడం లేదని విమర్శించారు. పైలట్ చేపట్టిన పాదయాత్రలో ఆరోపణలు చేసిన మంత్రి సహా 15 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తాము పార్టీ విడిచివెళ్లిపోవాలని గెహ్లాట్ అనుకుంటున్నారని, కానీ పార్టీలోనే కొనసాగుతామని, మీ వెంటే ఉంటామని ఎమ్మెల్యేలు పైలట్‌కు మద్దతు పలికారు.
గత బీజేపీ ప్రభుత్వం అంటే వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని పైలెట్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. రాజస్థాన్ కాంగ్రెస్ లో నాయకుల మధ్య విబేధాలను పరిష్కరించాలని అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరినీ ఒకే వేదికపై తీసుకురావాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?
గతంలోనూ ఓ సారి సచిన్ పైలట్ తిరుగుబాటుకు ప్రయత్నించారు. కొంత మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట వెళ్లారు.అయితే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేకపోవడంతో మళ్లి తిరిగి వచ్చారు. తర్వాత కేబినెట్ ను మార్చి.. వారి మధ్య సయోధ్య చేశారు. అయితే ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరగనున్నందున మరోసారి సచిన్ పైలట్ తన మార్క్ రాజకీయం చేస్తున్నారు . అయితే గెహ్లాట్ మాత్రం.. పైలట్ నమ్మకస్తుడు కాదని ఆయనను మాత్రం నమ్మవద్దని హైకమాండ్ కు చెబుతున్నారు. నిజానికి గెహ్లాట్ ను కాంగ్రెస్ అధ్యక్షుడ్ని చేయాలనుకున్నారు.కానీ సీఎం పదవిని వదులుకుంటే పైలట్ కు చాన్సిస్తారని ఆయన వెనుకడుగు వేశారు.