రాజస్థాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి మహిళలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ ఇస్తామని సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు. మధోపుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గహ్లోత్ ఈ విషయాన్ని వెల్లడించారు.
మహిళలు ప్రతి నెల ఋతుచక్రం సమయంలో ఎంతో బాధను అనుభవిస్తారు. ఋతుచక్రం గురించి బయటకు చెప్పడానికి కూడా సంకోచిస్తారు. దీని గురించి ఎందుకు మౌనంగా బాధ పడాలి? దీని గురించి మాట్లాడటానికి మహిళలు సంకోచించవద్దు. మన దేశంలో ఎంతో మంది ఇంకా శానిటరీ నాప్కిన్స్ వాడకుండా అనేక రోగాల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు దీనిపై అవగాహన కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపడుతున్నాయి. వారికి ప్రయోజనం కలిగేలా ఇక నుంచి మేము ప్రతి మహిళకు నెలకు పన్నెండు శానిటరీ ప్యాడ్ లు ఉచితంగా పంపిణీ చేస్తాం. - అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
ఈ ప్రకటన ఎంతో మంది పేద మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. వీటి ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని మహిళలు అనారోగ్యం పాలు కాకుండా ఉంటారని పేర్కొంది.
Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 'జోడో యాత్ర'లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్