Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో 'భారత్‌ జోడో యాత్ర' ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ పాదయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (Raghuram Rajan) కూడా జోడో యాత్రలో పాల్గొన్నారు.


బుధవారం ఉదయం రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపుర్‌ నుంచి రాహుల్‌ 'జోడో యాత్ర' ప్రారంభమైంది. ఆ సమయంలో రఘురామ్ రాజన్.. నడుస్తూనే రాహుల్‌ గాంధీ పలు అంశాలపై చర్చించారు.






మోదీ సర్కార్‌పై


నోట్ల రద్దు నుంచి మోదీ సర్కార్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రఘురామ్ రాజన్ బహిరంగంగానే విమర్శలు చేశారు. నోట్ల రద్దును వ్యతిరేకించడంలో కాంగ్రెస్‌కు రఘురామ్‌ రాజన్‌ మద్దతిచ్చారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు.


జోష్


'భారత్‌ జోడో యాత్ర' రాజస్థాన్‌లో ఉత్సాహంగా సాగుతోంది. కీలక నేతలు, వందలాది మంది కార్యకర్తలతో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఝలావార్‌లో యాత్ర సందర్భంగా రాహుల్‌ గాంధీ.. భాజపా కార్యాలయం మీదుగా వెళ్లారు. ఆ సమయంలో కార్యాలయంపైన ఉన్న భాజపా కార్యకర్తలకు ఫ్లైయింగ్‌ కిస్సెస్‌ ఇచ్చారు రాహుల్ గాంధీ. వారిని చూస్తూ గాల్లో ముద్దులు పెట్టారు. రాహుల్‌ గాంధీ ముద్దుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  






భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో పూర్తయి ఇటీవల రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 17 రోజులు 500 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. అయితే ఈ సందర్భంగా రాజస్థాన్‌లో ఆసక్తికర పరిణామం జరిగింది. తమ వైరుధ్యాలను పక్కన పెట్టి రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot), సచిన్ పైలట్ (Sachin Pilot).. కలిసి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. అంతేకాదు డ్యాన్స్ వేసి జోష్ నింపారు.






Also Read: Udhayanidhi Stalin TN Minister: మంత్రిగా ఉదయనిధి స్టాలిన్- కీలక శాఖ అప్పగించిన సీఎం