బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకులను పెద్దగా అలరించకపోయినా... విన్నర్‌కి ఇచ్చే బహుమతులు మాత్రం ఓ లెవెల్‌లో ఉన్నాయి. అందులోనూ బిగ్ బాస్ విన్నర్ అయితే ఆ ఫేమ్ మరింత పెరుగుతుంది. అందుకే కంటెస్టెంట్‌ల గెలుపు కోసం బయటఉన్న వారి కుటుంబ సభ్యులు, పిఆర్ టీమ్‌లు తెగ కష్టపడుతున్నాయి. ఇన్ స్టా, ట్విట్టర్లో తెగ ప్రచారం చేస్తున్నాయి. ఇందులో శ్రీహాన్ టీమ్ కాస్త ముందుంది. ఓట్ల కోసం సీనియర్ ఎన్టీఆర్‌ని వాడేశారు. బిగ్ బాస్‌లో శ్రీహాన్‌ను, పాత సినిమాల్లో ఎన్టీఆర్‌ను కలిపి ఒక వీడియో చేసి ఇన్ స్టాలో పోస్టు చేశారు. అది వైరల్ గా మారింది. ఎడిటింగ్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. 


ఏం తెలివి? 
జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో ‘ఆనాటి రాముడు ఈనాటి మనుమడు’ పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. అందులో గ్రాఫిక్స్ లో సీనియర్ ఎన్జీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి డ్యాన్సు వేసినట్టు చూపించారు. ఆ పాటను ఆ సినిమాలోని సీన్లను శ్రీహాన్ ఇన్ స్టా టీమ్ వాడేసుకున్నారు. అందులో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ప్రతి డైలాగును శ్రీహాన్‌కు అన్వయించేలా ఎడిట్ చేశారు. బిగ్ బాస్‌లో శ్రీహాన్ రియాక్షన్లను, డ్యాన్సులను జోడించారు.దీన్ని ఎన్టీఆర్ అభిమానులు నెగిటివ్ గా తీసుకోకుండా నవ్వుకుని వదిలేశారు. లేకపోతే ఈపాటికే ట్రోల్స్ మొదలయ్యేవి. 






అవకాశాలున్నాయా?
శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలేలో ప్రవేశించాడు. టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్న రెండు వారాల క్రితం అతను ఫైనల్లోకి వెళ్లాడు. అయితే గెలిచే అవకాశాలు మాత్రం తక్కువనే చెప్పాలి. రేవంత్, రోహిత్ లలో ఒకరు విన్నర్ అయ్యే అవకాశం ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఓటింగ్ పట్టించుకోవడం లేదు కనుక బిగ్ బాస్ టీమ్ ఆదిరెడ్డిని కామన్ మ్యాన్ అని చెప్పి విన్నర్ చేసినా చేస్తారు. నిజానికి ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కిందకి రాడు. కామన్ మ్యాన్ అంటే ఎక్కువ మందికి పరిచయం ఉండకూడదు. కానీ ఆదిరెడ్డి యూట్యూబ్ ఖాతాలో వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతనెలా కామన్ మ్యాన్ అయ్యాడో. ఏ విషయంలోనూ పెద్ద గొప్పగా అనిపించలేదు ఆదిరెడ్డి. బిగ్బాస్ టీమ్ ఏం చేస్తుందో చూడాలి. 



Also read: స్నేహితులు జట్టుగా ఆడితే తప్పు కాదు, అదే భార్యాభర్తలు కలిసి ఆడితే తప్పేంటి - రోహిత్‌ జర్నీ వీడియోలో బిగ్‌బాస్