టీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్. షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి BB OTT కంటెస్టెంట్ ఆమె. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సులు.. ఉఫ్.. ఉర్ఫీ.. ఇవేం డ్రెస్సులు అనిపించేలా ఉంటాయి. ఆమె వెరైటీ దుస్తుల వల్లే నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  ఉర్ఫీ ఇంటి పేరు కారణంగా జావేద్ అక్తర్ మేనకోడలు అని కూడా పుకార్లు వచ్చాయి. ఇంతకీ, ఉర్ఫీ జావేద్ ఎవరు? ఆమె గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం..


ఉర్ఫీ జావేద్ ఎవరు?


బిగ్ బాస్ OTT షో తర్వాత ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించింది. ALT బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా,  ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించింది. 2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రను పోషించింది. 2018లో SAB TV  ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి పాత్రను పోషించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది.


ఉర్ఫీ జావేద్ వ్యక్తిగత జీవితం


ఉర్ఫీ జావేద్ అక్టోబర్ 15, 1997న లక్నోలో జన్మించింది. ఆమెకు అస్ఫీ జావేద్ అనే సోదరి ఉంది. ఆమె లక్నోలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్‌ లో పట్టా అందుకుంది. పరాస్ కల్నావత్‌ తో రిలేషన్‌ షిప్‌ కొనసాగిస్తోంది.  


ఉర్ఫీ జావేద్ వివాదాస్పద దుస్తులు


ఉర్ఫీ జావేద్‌ వెరైటీ డ్రెస్సులతోనే బాగా పాపులర్ అయ్యింది. ఆమె వేసుకునే వింత వింత డ్రెస్సులు నెట్టింట్లో తెగ ట్రోల్ కు గురవుతాయి. BB OTT తొలగింపు తర్వాత  ముంబై విమానాశ్రయంలో నటి కనిపించింది.  కత్తిరించిన డెనిమ్ టాప్, జీన్స్ ధరించి విమానాశ్రయం నుంచి బయటకు వెళ్తూ కెమెరాలకు చిక్కింది. నెటిజన్లు, ఆమె దుస్తుల విషయంలో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, కెండల్ జెన్నర్ బోల్డ్ బ్లాక్ కటౌట్ దుస్తులను కాపీ చేసి నెటిజన్ల చేత తిట్లు తిన్నాది. ఆ తర్వాత నల్లటి టాప్ కు కొన్ని ఈకలు ఉన్న డ్రెస్సును వేసుకుంది. బోల్డ్ డ్రెస్సులతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది.


ఉర్ఫీ, జావేద్ అక్తర్ మేనకోడలా?  


ఉర్ఫీ ఇంటిపేరు కారణంగా ఉర్ఫీ.. జావేద్ అక్తర్ మనవరాలు అని కొంత మంది నెటిజన్లు ప్రచారం చేశారు.  ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తను ఈ విషయాన్ని కొట్టిపారేసింది. జావేద్ అక్తర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. జావేద్ అక్తర్ భార్య షబానా అజ్మీ కూడా ఉర్ఫీ జావేద్‌ కు తన కుటుంబానికి సంబంధం లేదని ట్విట్టర్‌లో స్పష్టం చేసింది.





పరాస్‌తో డేటింగ్ ముమ్మటికీ పొరపాటు


ఉర్ఫీ జావేద్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ పరాస్ కల్నావత్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తన కారణంగానే ‘అనుపమ’ సీరియల్ లో అవకాశం కోల్పోయినట్లు వెల్లడించింది. వాస్తవానికి ‘అనుపమ’ సీరియల్ రేటింగ్ లో టాప్ లిస్టులో నిలిచింది. అయితే, ఇందులో తాను కూడా నటించాల్సి ఉండేదని ఉర్ఫీ జావేద్ ఇటీవల చెప్పింది.  ఇందులో తన మాజీ ప్రియుడు పరాస్ కల్నావత్‌తో కలిసి  పని చేయాల్సి ఉందని పేర్కొంది. అయితే, ఆమెను ఆ సీరియల్‌లోకి తీసుకోవద్దని పరాస్ మేకర్స్‌ని కోరాడని చెప్పింది. అందుకే పరాస్ నుంచి విడిపోయినట్లు చెప్పింది. పరాస్ తో డేటింగ్ చేయడం తాను చేసిన పొరపాటు అని పేర్కొంది.  


Read Also: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు మరో షాక్, పరువు నష్టం కేసు పెట్టిన నోరా ఫతేహి