ABP  WhatsApp

PM Modi: 'గత ప్రభుత్వాలు లాకర్లు నింపుకున్నాయి.. మేం పేదల కడుపులు నింపుతున్నాం'

ABP Desam Updated at: 25 Oct 2021 05:12 PM (IST)
Edited By: Murali Krishna

ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 వైద్య కళాశాలలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 కళాశాలలు ప్రారంభించిన మోదీ

NEXT PREV

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. సిద్దార్థ్‌నగర్‌లో పర్యటించిన మోదీ 9 వైద్య కళాశాలలను ప్రారంభించారు. 






సిద్ధార్థ్​నగర్​, ఈటాహ్​, హర్దోయ్​, ప్రతాప్​గఢ్​, ఫతేపుర్​, దేవరియా, మీర్జాపుర్​, జౌన్​పుర్​ జిల్లాలో రూ. 2,329 కోట్ల వ్యయంతో ఈ 9 కళాశాలలను నిర్మించారు. కేంద్ర పథకం ద్వారా 8 కళాశాలను ఏర్పాటు చేశారు. జౌన్​పుర్​లోని వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులతో నిర్మించుకుంది. ఈ వైద్య కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని.. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.







ఈ 9 వైద్య కళాశాలలను ప్రారంభించడం ద్వారా 5 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. గత ప్రభుత్వాలు పూర్వాంచల్‌ను రోగాలతో బాధపడేలా గాలికి వదిలేశారు. కానీ ఇప్పుడు ఉత్తర భారతావనికే పూర్వాంచల్ మెడికల్ హబ్‌గా మారనుంది. తొమ్మిది కళాశాలలు ఒకసారే ప్రారంభించడం ఎప్పుడైనా జరిగిందా? గత ప్రభుత్వాలకు తమ కుటుంబాల లాకర్లు నింపుకోవడానికి సమయం చాలలేదు. కానీ పేదోడికి డబ్బులు దాచి.. వారికి ఖర్చు చేయడమే మా లక్ష్యం.                                              - ప్రధాని నరేంద్ర మోదీ


ఈ కార్యక్రమంలో ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవీయా సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.


Also Read: Mumbai News: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. వాంఖడేపై విజిలెన్స్ విచారణ!


Also Read: UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వాగ్దానం.. ఈసారి ఉచిత వైద్యంపై హామీ


Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?


Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 25 Oct 2021 05:09 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.