Wayanad Landslides: ప్రధాని నరేంద్ర మోదీ వయనాడ్‌లో పర్యటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు కేంద్రమంత్రి సురేశ్ గోపీ ఉన్నారు. ఏరియల్ సర్వే పూర్తైన తరవాత వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మోదీ. సహాయక చర్యలు ఎలా చేపడుతున్నారో ఆరా తీశారు. బాధితులను ఎక్కడికి తరలించారో అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు ప్రస్తుత పరిస్థితులను మోదీకి వివరించారు. ఆ తరవాత ఆయన రిలీఫ్ క్యాంప్‌లలోని బాధితులను పరామర్శించారు. ఈ ముప్పు నుంచి తృటిలో తప్పించుకుని బయట పడ్డ వాళ్లతో మాట్లాడారు. అయిన వాళ్లను పోగొట్టుకున్న చాలా మంది ఇక్కడే తలదాచుకుంటున్నారు.


ప్రధాని మోదీ కనిపించగానే వాళ్లు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న బాధలో కన్నీళ్లు పెట్టుకున్నారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని తలుచుకుని బాధితులు ఎమోషనల్ అయ్యారు. వాళ్లను ఓదార్చిన ప్రధాని మోదీ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మోదీతో మాట్లాడుతూ ఓ యువకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ యువకుడి భుజం తడుతూ మోదీ ఓదార్చారు. 






హాస్పిటల్‌లో పరామర్శ..


ఆ తరవాత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులనూ పరామర్శించారు ప్రధాని. పేరుపేరునా అందరినీ పలకరించి వాళ్ల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. వైద్యం సరిగా అందుతుందా లేదా అని ఆరా తీశారు. (Also Read: Viral News: పరువు హత్య నేరం కాదు, అది కూడా ఓ రకం ప్రేమే - తమిళ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు)


 






అంతకు ముందు వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మోదీ. ఇండియన్ ఆర్మీ నిర్మించిన బెయిలీ బ్రిడ్జ్‌పై నడిచారు. అక్కడ సహాయక చర్యలు ఎలా చేపట్టారో అడిగి తెలుసుకున్నారు. రిలీఫ్ క్యాంప్‌లలో దాదాపు 25 నిముషాల పాటు గడిపారు. ఎక్కువగా ప్రభావితమైన చూరల్‌మలలోనూ పర్యటించారు. ఇక్కడే దాదాపు 226 మంది ప్రాణాలు కోల్పోయారు. 120 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. ఇళ్లు, ఆస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.


Also Read: India Maldives: ఇకపై మాల్దీవ్స్‌లోనూ యూపీఐ చెల్లింపులు, త్వరలోనే అందుబాటులోకి వచ్చేలా కీలక ఒప్పందం