Trolls On Indian 2 Movie:  విశ్వనటుడు కమల్‌ హాసన్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్‌ మూవీ 'ఇండియన్‌ 2'. భారీ అంచనాల మధ్య జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. అసలు ఇది శంకర్‌ సినిమానేనా! అనేంతగా ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్‌ చేసింది. ఫలితంగా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. రోటిన్‌ స్టోరీ, స్లో నరేషన్‌తో ఏదో కానిచ్చేశామా అన్నట్టు శంకర్‌గా 'ఇండియన్‌ 2'ని తెరకెక్కించారనే విమర్శలు వచ్చాయి. 28 ఏళ్ల క్రితం ఇదే కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌ అనగానే అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.


కానీ, ఈ సీక్వెల్‌ భారతీయుడు క్రేజ్‌ని తగ్గించేసింది. నిజానికి భారతీయుడిని ఈ సీక్వెల్‌తో పోల్చలేనమి, కనీసం దాని దారిదాపుల్లో కూడా ఈ చిత్రం లేదంటూ ట్రోల్‌ చేశారు. పైనల్‌గా థియేటర్లో విడుదలైన నెల రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఆగష్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ఇండియన్ 2 డిజిటల్‌ వేదికపై అయినా పాజిటివ్‌ రివ్యూస్‌ అందుకుంటుంది అనుకుంటే ఇక్కడ మరింత దారుణంగా ట్రోల్స్‌కి గురవుతుంది. ఇందులో సీన్స్‌ని కామెడీ చేస్తూ మిమ్స్ క్రియేట్‌ చేసి నెట్టింట దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. 






ఇంతకంటే చెత్త సినిమా లేదని, ఓ లెజెండరీ నటుడితో కామెడీ ఫైట్‌ సీన్స్‌ చేయించారంటూ శంకర్‌పై మండిపడుతున్నారు. అసలు శంకర్ కు ఏమైంది.. ఇంత దారుణమైన సినిమా ఎలా చేశాడంటూ మరొకరు అన్నారు. ఇండియన్‌ సీరియస్‌, యాక్షన్‌ చిత్రమైతే.. 'ఇండియన్‌ 2' కామెడీ సినిమా అని, ఇందులో సిద్దార్థ్‌ యాక్టింగ్‌ ఓవర్‌గా ఉందని, ఆయన డైలాగ్స్ క్రింజ్‌గా అనిపించాయంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు శంకర్‌ కెరీర్‌లోనే ఇదోక చెత్త సినిమా అని, ఇందులో అసలు శంకర్‌ మార్క్ ఎక్కడ కనిపించలేదంటున్నారు. ఇలా ఓటీటీకి వచ్చిన గంటల్లోనే ఈ సినిమా దారుణమైన ట్రోల్స్‌ గురవుతుంది. నెట్టింట మొత్తం ఇండియన్‌ 2 ట్రోలింగ్ పోస్టులు, వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. 










Also Read: ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్ మూవీ స్టోరీ ఇదే! - కొత్త పోస్టర్‌లోనే కథంతా చెప్పేశారు..


ఇండియన్ 2 మూవీని ఎప్పుడో నాలుగేళ్ల కిందట ప్రకటించి రెండేళ్ల క్రితం సెట్స్‌పైకి తీసుకువచ్చారు. అయితే షూటింగ్‌ ప్రారంభంలోనే ఈ సినిమాకు అవాంతారాలు వచ్చాయి. సెట్‌లో అగ్ని ప్రమాదం జరగడం, అందులో ప్రోడక్షన్‌ బామ్‌ చనిపోవడంతో ఇక సినిమా షూటింగ్‌ని పూర్తిగా నిలిపేద్దామనుకున్నాడు. కానీ నిర్మాతలే పట్టుబట్టి సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలు పట్టించారు. ఈ సీక్వెల్‌తో పాటు రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'ని కూడా షూటింగ్‌ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌ అంతా ఇప్పుడు ఈ మూవీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు భారీ ప్రాజెక్ట్స్‌, నిజానికి పాన్‌ ఇండియా సినిమా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి ఫోకస్‌ అంతా ఆ సినిమా షూటింగ్‌పైనే ఉండాలి. కానీ శంకర్‌ మాత్రం రెండు పాన్‌ ఇండియా చిత్రాలు ఒకేసారి చిత్రీకరించారు. దానివల్లే ఇండియన్‌ 2 అవుట్‌పుట్‌ సరిగా లేదని, సీరియస్‌ యాక్షన్‌ మూవీ కాస్తా కామెడీ యాక్షన్‌ అయ్యిందంటున్నారు. మరి గేమ్‌ ఛేంజర్‌ మూవీని ఎలా తీశారో, అది ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో అని మెగా ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.