Jr NTR and Prashanth Neel NTR 31 Movie Story: ఎట్టకేలకు ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కింది. నిన్న గప్‌చుప్‌గా NTR31 మూవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా.. ప్రశాంత్ నీల్ సతీసమేతంగా వచ్చారు. ఇక అలాగే మైత్రీ మూవీ మేకర్స్, కళ్యాణ్ రామ్‌లు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రారంభోత్సవం వేడుకను పింపుల్‌గా నిర్వహించినా.. మూవీ అప్‌డేట్స్ మాత్రం మోతమోగేలా ఉన్నాయి.
2026లో రిలీజ్
ప్రాజెక్ట్ లాంచింగ్ రోజే మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచింది. పోస్టర్ చూస్తే సింపుల్‌గానే ఉంది, కానీ.. కాస్తా పట్టి చూస్తే అసలు విషయం తెలుస్తోంది. డార్క్ థిమ్‌లో ఎన్టీఆర్-నీల్ అనే టైటిల్‌తో జనవరి 9, 2026లో సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పోస్టర్ బ్యాగ్రౌండ్ చూస్తే వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. దానిలో ఒకవైపు 1969 అని రాసుంది, దానికి కుడివైపు గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది.
పోస్టర్లోనే ఉంది కథంతా..
ఇక టాప్‌లో లెఫ్ట్ కార్నర్ చూస్తే చైనా, భూటాన్, బెంగాల్- కోల్‌కతా అని రాసుంది. ఇదంతా మూవీ కాన్సెప్ట్ అని అర్థమైపోతుంది. దీంతో ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియా NTR3 స్టోరీలైన్ వైరల్ అవుతుంది. అయితే గతంలో ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్య్వూలో మూవీ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో సినిమా అనగానే అంతా ఇది ఓ యాక్షన్ మూవీ అయ్యింటుందని అనుకుంటున్నారు. కానీ, తాను ఈ సినిమాతో కొత్త జానర్ టచ్ చేశానని చెప్పారు. నిజానికి ప్రశాంత్ నీల్ సినిమాల బలం యాక్షన్, మైన్స్. కానీ ఈ ప్రాజెక్ట్‌లో తాను యాక్షన్ జోలికి వెళ్లాలి అనుకోవడం లేదన్నాడు. ఇది తనకు కొత్త కథ అంటూ చెప్పుకొచ్చాడు.
అందుకే డ్రాగన్ అనుకుంటున్నారా?
NTR31 కొత్త పోస్టర్ గమనిస్తే ఈ సినిమా చైనా, ఇండియాకు మధ్య సాగే కథాంశం అని తెలుస్తోంది.1969 ఓపియం మాఫియాకి రిలేట్ చేస్తూ.. డ్రగ్ మాఫియాలో ఎన్టీఆర్ డ్రగ్ లార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్‌కి దగ్గరగా ఉండటంతో.. ఓపియం స్మగ్లింగ్ కి అడ్డాగా ఉండేదట, దాంతో ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేదట.చూస్తుంటే ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని ప్రశాంత్ నీల్ తనదైన స్టైల్లో కథను రాసుకున్నాడట. చైనా డ్రగ్స్ మాఫీయా కోల్‌కాత్తాలో యాక్టివ్‌గా ఉండటం.. అక్కడ అక్కడ లోకల్స్ గ్యాంగ్స్‌కి, వీరికి తరచూ గోడవలు జరుగుతుంటాయి. ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా యూరప్ వరకు విస్తరించాయి అంటారు.
ఇప్పుడు ఇదే పాయింట్‌తో ప్రశాంత్ NTR31 ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారని టాక్. ఈ కథలో చైనా ప్రమేయమే ప్రధానంగా ఉండటంతో ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. దీనిపై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినా..ఈ సినిమాకు 'డ్రాగన్' టైటిల్ అనుకుంటున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కథ ఇది తారపూర్ పవర్ స్టేషన్ నేపథ్యంలో సాగనుందంటూ మరో స్టోరీ లైన్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 1969లో భారత్‌లో ప్రారంభించిన తొలి అటామిక్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ చూట్టూ ఈ కథ సాగుతుందని అంటున్నారు. రి దీనిపై క్లారిటీ రావాలంటే నెక్ట్స్ అప్‌డేట్ వరకు వేచి చూడాల్సిందే.
Also Read: శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత ఫస్ట్‌టైం బయటకు వచ్చిన నాగ చైతన్య - రాజమండ్రి పెళ్లిలో చై సందడి!