Prime Minister Modi announced that medical education will be provided in local languages: మెడిసిన్ చదలవాలంటే ఖచ్చితంగా ఇంగ్లిష్‌లోనే. కనీసం హిందీలో కూడా మెడిసిన్ అందుబాటులో లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ స్థానిక భాషల్లో మెడిసన్ చదువుకునేలా అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ వైద్య విద్యను అందిస్తామని చెబుతున్నారు. బీహార్‌లోని దర్బంగాలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే లక్షకుపై ఎంబీబీఎస్ సీట్లను పెంచామని రాబోయే రోజుల్లో మరో 75వేల సీట్లను అందుబాటులోకి తెస్తామన్నారు.
మధ్యప్రదేశ్‌లో హిందీ మీడియం ఎంబీబీఎస్ పుస్తకాల ఆవిష్కరణ
స్థానిక భాషలో వైద్య విద్య ప్రకటనను ప్రధాని మోదీ గతంలోనూ చేశారు. భారత నూతన విద్యా విధానం ప్రకారం భారతీయ భాషల్లో సాంకేతిక, వైద్య కోర్సుల బోధనను చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వైద్య పాఠ్య పుస్తకాలను హిందీలో విడుదల చేసింది. మధ్య ప్రదేశ్‌లో ఎంబీబీఎస్ కోర్సు కోసం హిందీని బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాల్లో భాగంగానే ఈ పుస్తకాలు విడదల చేశారు.
Also Read: ఎలోన్ మస్క్, వివేక్ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు- కీలక బాధ్యతలు అప్పగించిన ట్రంప్
తెలుగు, తమిళ, కన్నడ మీడియాల్లోనూ మెడిసిన్
తమిళనాడు ప్రభుత్వం తమిళంలో వైద్య విద్యా బోధన చేయాలనే డిమాండ్ చేస్తోంది. ఇంగ్లిషులో కంటే మాతృభాషలో విద్యా బోధన చేస్తే ఆలోచించడం, మననం చేయడం, హేతుపూర్వకంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం సులభమని నిపుణులు మొదటి నుంచి చెబుతున్నారు. మాతృభాషలో సాంకేతిక కోర్సులను చాలా దేశాల్లో బోధిస్తున్నారు. జపాన్‌లో జపనీస్ భాషలోనే విద్య అంతా సాగుతుంది.అక్కడ ఇంగ్లిష్‌కు ప్రాధాన్యత ఉండదు. కానీ జపాన్ సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో మంచి విజయం సాధించందది. చైనా, రష్యా, జర్మనీ కూడా తమతమ భాషల్లోనే సాంకే తిక విద్యలను బోధిస్తున్నాయి.
Also Read: రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడం ట్రంప్‌కి సాధ్యమేనా?
కొన్ని సమస్యలూ ఉంటాయంటున్న నిపుణులు
ప్రస్తుతం భారతదేశంలో 600కుపైగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. స్థానిక భాషలను ప్రవేశ పెడితే ఇతర రాష్ట్రాల్లో చేరేందుకు పెద్దగా అవకాశం ఉండదు. ఒక్క మెడిసిన్‌లోనే కాకుండా ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కూడా భారతీయ భాషల్లో కోర్సులను ప్రవేశపెడతామని గతంలో కేంద్రం ప్రకటించింది. తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ భాష ల్లోకి ఇంజినీరింగ్ పుస్తకాలను అనువదించే ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రకటించారు కాబట్టి వచ్చే రెండు, మూడేళ్లలో భారతీయ భాషల్లో కూడా వైద్య విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.