Prabhas received a special invitation to Ayodhya :   ‘ఆదిపురుష్‌’ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషించిన దక్షిణాది పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభా్‌సతో పాటు కన్నడ నటుడు యశ్‌కు వచ్చే నెల 22న అయోధ్యలో నిర్వహించే రామమందిర ప్రతిష్ఠాపన వేడుకకు ఆహ్వానం అందింది. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్లు తెలిసింది. బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌కపూర్‌-ఆలియా భట్‌, అజయ్‌ దేవగన్‌, సన్నీ డియోల్‌, టైగర్‌ ష్రాప్‌, ఆయుష్మాన్‌ ఖురానా కూడా అతిథుల జాబితాలో ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇటు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, చిరంజీవి, రజినీకాంత్‌, మోహన్‌లాల్‌, సంజయ్‌ లీలా బన్సాలీ, మాధురి దీక్షిత్‌, అనుపమ్‌ ఖేర్‌, ధనుశ్‌, రిషభ్‌ శెట్టిని కూడా ఇప్పటికే వేడుకలో పాల్గొనాలని ఆహ్వానించారు.                     

  


దేశంలో జనవరి మొత్తం అయోధ్య రామాలయం సందడి ఉండనుంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి వీఐపీ ఆహ్వానాలు వచ్చాయన్నదానిపై స్పష్టత లేదు.  కానీ మొదటి సారిగా హీరో ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. టాలీవుడ్‌లో ఇంకెవరికీ ఇలాంటి చాన్స్ రాలేదు.    ప్రభాస్ బాహు బలి సినిమాతో  పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన ఏ సినిమా చేసినా హిందీలో సైతం మంచి మార్కెట్ వచ్చింది. అదే సమయంలో ప్రభాస్‌కు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ నేతగా ఉంటూ చనిపోయారు. గతంలో ప్రభాస్ రెండు, మూడు సార్లు ప్రధానితో భేటీ అయ్యారు కూడా.  ఇటీవల ఆదిపురుష్‌లో రాముడి క్యారెక్టర్ కూడా పోషించారు. అందుకే ప్రభాస్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది.


అయోధ్య రామాలయాన్ని జాతీయ  పండుగలాగా నిర్వహిస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఓ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నారు.   ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత చివరకు నవంబర్‌ 9, 2019న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి సమ్మతించింది.. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేయగా.. జనవరి 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట  కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 16న వేడుకలు మొదలై.. అదే నెల 22న ముగియనున్నాయి.                           


జనవరి 15 నాటికి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు. 22న  గర్భాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగనుండగా.. ప్రధాని మోదీ హాజరవనున్నారు. ఈ వేడుకకు రాజకీయ నాయకులతోపాటు బౌద్ధ మత గురువు దలైలామా, ముఖేష్ అంబానీతో పాటు నటీనటులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరవనున్నారు. మరో వైపు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ నేపథ్యంలో దేశమంతా వేడుకలు నిర్వహించనున్నారు.