Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్న్‌ ధర ఎందుకంత ఎక్కువగా ఉంటుందో పీవీఆర్ ఛైర్మన్ అజయ్ బిజ్లీ వివరించారు.

Continues below advertisement

Popcorn Price In Multiplex: 

Continues below advertisement

నీళ్ల బాటిల్‌కి కూడా రూ.50 పెట్టాల్సిందే..

"ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకెళ్లి ఎన్ని రోజులైందో అంది" వీణ.

"అమ్మో ఫ్యామిలీ అంతానా..? మనం నలుగురు కలిసి వెళ్తే ఒక్క దెబ్బకు రూ.2 వేలు ఎగిరిపోతాయ్" అని సమాధానమిచ్చాడు" 
వినయ్. 

ప్రతి మిడిల్ క్లాస్‌ వాడి బాధ ఇదే. సింగిల్ థియేటర్ల సంఖ్య తక్కువైపోయి..క్రమంగా మల్టీప్లెక్స్‌లు పెరిగిపోతున్నాయి. ఆ మల్టీప్లెక్స్‌కు వెళ్తే డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు చేయాల్సిందే. ఆఖరికి ఆ మంచి నీళ్ల బాటిల్‌కి కూడా కనీసం రూ.50 పెట్టాల్సిందే. ఎందుకింత ధర అని అడిగితే వాళ్ల సమాధానాలు వాళ్లకుంటాయి. అవెలాగో మనకు నచ్చవు. అఫ్‌కోర్స్ నచ్చకపోయినా చేసేదేమీ లేదు. సైలెంట్‌గా డబ్బులు కట్టి తీసుకుని వచ్చేయటమే. మంచినీళ్ల విషయం పక్కన పెట్టండి. కామన్‌ మేన్‌ను వణికించే ఫుడ్ ఐటమ్ ఒకటుంది. అదే పాప్‌కార్న్. జంబో, సింగిల్ అంటూ రకరకాల పేర్లు పెట్టి వందలకు వందలు వసూలు చేస్తుంటాయి మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు. బయట రూ. 20 పెడితే వచ్చే పాప్‌కార్న్‌ మల్టీప్లెక్స్‌లో రూ.200 ఎందుకుంటుంది..? అని అందరికీ డౌట్ ఉంటుంది. ఇదే విషయమై చాలా మంది మల్టీప్లెక్స్‌ల మేనేజ్‌మెంట్‌పై వాగ్వాదానికీ దిగుతుంటారు. అయినా లాభం ఏమీ ఉండదు. వాళ్ల బిజినెస్‌ అలా నడుస్తూనే ఉంటుంది. పాప్‌కార్న్‌ను ఎందుకింత కాస్ట్ పెట్టి అమ్ముతున్నారన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. పీవీఆర్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ ఈ విషయంపై వివరణ ఇచ్చారు. 

ఈ కాస్ట్‌లన్నీ కలుపుకుంటాం కాబట్టే అంత ధర: అజయ్ బిజ్లీ 

"ఇప్పుడిప్పుడే ఇండియాలో సింగిల్‌ స్క్రీన్స్‌ పోయి..మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లో విక్రయించే ఫుడ్‌ కాస్ట్‌కు ఆపరేషనల్ కాస్ట్‌ను కూడా కలుపుతాం. అందుకే వాటి ధర ఎక్కువగా ఉంటుంది" అని చెప్పారు...బిజ్లీ. ప్రస్తుతానికి భారత్‌లో ఫుడ్ అండ్ బేవరేజిస్ మార్కెట్ విలువ రూ.1500కోట్లుగా ఉందని వెల్లడించారు. "మల్టీప్లెక్స్‌లలో ఎక్కువ స్క్రీన్స్‌ ఉంటాయి. కనీసం 4-6 స్క్రీన్స్‌ ఏర్పాటు చేస్తారు. వీటి కోసం మల్టిపుల్ ప్రొజెక్షన్ రూమ్స్, సౌండ్ సిస్టమ్స్‌ అవసరమవుతాయి. కేవలం థియేటర్లలోనే కాకుండా...మల్టీప్లెక్స్‌ అంతా ఏసీలతో కవర్ చేస్తాం. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో ఏసీలు వినియోగించాల్సి వస్తుంది" అని వివరించారు.

"వినియోగదారులు మా యాజమాన్యాలతో గొడవ పడటంలో ఎలాంటి తప్పు లేదు. మాల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు మేము చేసే ఖర్చులే ఫుడ్ కాస్ట్‌ను పెంచుతున్నాయి. ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్, మేనేజ్‌మెంట్ కాస్ట్, సిబ్బంది జీతాలు, మాల్ స్పేస్‌ కోసం కట్టే అద్దె..ఇలా ఎన్నో ఖర్చులుంటాయి. వీటన్నింటినీ మేముతప్పకుండా భరించాల్సిందే. ఈ కాస్ట్‌ని బ్యాలెన్స్ చేసేందుకే మాల్స్‌లో ఫుడ్‌కి అంత కాస్ట్ పెడతాం. దయచేసి బయట ధరలతో, ఇక్కడి ధరల్ని పోల్చి చూడకండి" అని చెప్పారు పీవీఆర్ ఛైర్మన్ అజయ్ బిజ్లీ. మొత్తంగా ఆయన మాటల్లోని సారాంశం ఏంటంటే..మల్టీప్లెక్స్‌ ఎక్స్‌పీరియెన్స్ కావాలంటే ఈ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు అనే. భారత్‌లో రెండు బడా మల్టీప్లెక్స్ చెయిన్స్ అయిన పీవీఆర్-ఐనాక్స్ (PVR-INOX) ఒక్కటైపోయాయి. ఆడియెన్స్‌కి కొత్త అనుభూతినిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థలు ప్రకటించాయి. 

Also Read: మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఇట్టే పడిపోతారు

Also Read: Indian National Anthem: నిరంతర జాతీయ గీతాలాపన, ఎక్కడో కాదు మన దగ్గరే

 

 

Continues below advertisement