Chintan Shivir: వన్ నేషన్- వన్ పోలీస్ యూనిఫాం: ప్రధాని మోదీ

ABP Desam   |  Murali Krishna   |  28 Oct 2022 05:26 PM (IST)

Chintan Shivir: ఒకే దేశం- ఒకే పోలీస్ యూనిఫాం ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తావించారు.

వన్ నేషన్- వన్ పోలీస్ యూనిఫాం: ప్రధాని మోదీ

Chintan Shivir: దేశవ్యాప్తంగా పోలీసులను ఒకే రీతిలో చూడాలన్నదే తన కోరికని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం పోలీసులు అందరికీ ఒకే రకమైన యూనిఫాం ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రాల హోం మంత్రులతో జరిగిన చింతన్‌ శిబిర్‌లో ఆయన ఈ  ప్రతిపాదన ఉంచారు. 

ఒకే దేశం.. పోలీసులందరికీ ఒకే యూనిఫాం. ఇది ఒక ఆలోచన మాత్రమే. ఈ నిర్ణయాన్ని మీ మీద బలవంతంగా రుద్దాలన్నది నా అభిమతం ఎంతమాత్రం కాదు. దేశంలో పోలీసులందరికీ ఒకే రకమైన గుర్తింపు ఉండాలన్నది నా అభిమతం. అందుకే ఒక ఆలోచన ఇస్తున్నా. ఐదు, యాభై, వంద ఏళ్లకు ఇది జరగొచ్చు.. జరగకపోవచ్చు.. కానీ, ఒక ఆలోచన చేద్దాం.                              - ప్రధాని నరేంద్ర మోదీ
 

హక్కులు కాపాడాలి

హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. రెండ్రోజుల పాటు అన్ని రాష్ట్రాల హోం మంత్రులతో ఈ సమావేశం సాగనుంది. ఈ సందర్భంగానే ఆయా రాష్ట్రాల్లోని శాంతిభద్రతల గురించి ప్రస్తావించారు.

చట్ట ప్రకారం నడుచుకునే పౌరుల హక్కులను కాపాడడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే అరాచక శక్తులను అణగదొక్కడం మన బాధ్యత. చిన్న వదంతు కూడా దేశంలో అశాంతి సృష్టిస్తుంది. పౌరులు ఏదైనా సరే ఫార్వర్డ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా వాళ్లకు అవగాహన కల్పించాలి. అది నమ్మే ముందు వెరిఫై చేసుకోవాలనీ మనం చెప్పాలి                                                     - ప్రధాని నరేంద్ర మోదీ

ఈ కార్యక్రమంలో హోం సెక్రటరీలు, డీజీపీలు, Central Armed Police Forces డైరెక్టర్ జనరల్స్, Central Police Organisations డైరెక్టర్ జనరల్స్ హాజరవుతారు. దేశ అంతర్గత భద్రతను పటిష్ఠం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ సమావేశంలో చర్చిస్తారు. పోలీస్ ఫోర్స్‌ను నవీకరించటం సహా సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, సరిహద్దు వివాదాల పరిష్కారం, తీరప్రాంత పరిరక్షణ, మహిళా భద్రత, డ్రగ్ ట్రాఫికింగ్ లాంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

Also Read: Jammu Kashmir: ప్రాణ భయంతో గ్రామాన్ని విడిచిపెట్టిన చివరి కశ్మీరీ పండిట్!

Published at: 28 Oct 2022 05:25 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.