PM Modi Karnataka Visit:
కమలం ఆకారంలో విమానాశ్రయం..
కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. రూ.450 కోట్లతో నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌ను పరిశీలించారు. Passenger Terminal Buildingను కమలం పువ్వు ఆకారంలో నిర్మించారు. ప్రారంభించే ముందు విమానాశ్రయాన్ని పరిశీలించారు ప్రధాని. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. మల్నాడు ప్రాంతంలో కనెక్టివిటీని పెంచే విధంగా ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ కార్యక్రమం పూర్తైన వెంటనే రెండు కీలక రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శివమొగ్గ-షికారిపుర-రాణెబెన్నూర్ రైల్వే లైన్‌తో పాటు కొటెగంగూరు రైల్వే కోచింగ్ డిపోకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు మరో నాలుకు కీలక పథకాలనూ ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా 4.4 లక్షల మందికి లబ్ధి జరగనుంది. మల్టీ విలేజ్ స్కీమ్‌లను ప్రారంభించిన మోదీ రూ.950 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్‌ను మొదలు పెట్టారు. శివమొగ్గలోనే రూ.895 కోట్ల విలువైన 44 స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. ఇందులో భాగంగా 110 కిలోమీటర్ల పొడవైన 8 స్మార్ట్ రోడ్ ప్యాకేజ్‌లు అందిస్తారు. కంట్రోల్ సెంటర్, మల్టీ లెవల్ పార్కింగ్, స్మార్ట్ బస్ షెల్టర్ ప్రాజెక్ట్‌లు, సాలిడ్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్...తదితర ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు.
"శివమొగ్గ ఎయిర్‌పోర్ట్ చాలా అద్భుతంగా అందంగా ఉంది. టెక్నాలజీ మాత్రమే కాదు. కర్ణాటక సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించారు. ఇది కేవలం ఎయిర్‌పోర్ట్ మాత్రమే కాదు. ఈ ప్రాంత యువత తమ కలలు సాకారం చేసుకునేందుకు దొరికిన గొప్ప అవకాశం. ఇవాళ యడియూరప్ప పుట్టినరోజు. ఆయన ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఆయన తన జీవితాన్ని రైతులకు, ప్రజలకు అంకితం చేశారు. అసెంబ్లీలో ఆయన చేసిన చివరి ప్రసంగం ఎంతోమందిలో స్ఫూర్తి నింపింది."
ప్రధాని నరేంద్ర మోదీ