ఆగస్ట్ 20 ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సోమ్ నాథ్ ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సోమ్ నాథ్ రిసార్ట్, ప్రదర్శనశాలను మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మోదీ.. పార్వతీ ఆలయానికి కూడా శంకుస్థాపన చేస్తారు.
మొత్తం 47 కోట్లతో ఈ పునర్నిర్మాణ పనులను చేపట్టారు. పురాతన సోమ్ నాథ్ కట్టడాలకు ఆధునిక హంగులను అద్దుతూ ప్రదర్శనశాలను సుందరంగా తయారు చేశారు.
Modi: మన ఒలింపిక్స్ హీరోలతో మర్చిపోలేని రోజు... మోదీ షేర్ చేసిన వీడియో వైరల్
సోమ్ నాథ్ రినోవేటెడ్ టెంపుల్ కాంప్లెక్స్ ఓల్డ్ (జునా)ను శ్రీ సోమ్ నాథ్ ట్రస్ట్ రూ.3.5 కోట్లతో పూర్తి చేసింది. దీనిని అలీభాయ్ మందిరంగా పిలుస్తారు. రాణి అలీభాయ్ నిర్మించిన కారణంగా ఈ పేరు వచ్చింది. పాత ఆలయం పూర్తిగా శిథిలమవడం వల్ల ఈ మందిరాన్ని పునర్నిర్మించారు.
శ్రీ పార్వతి ఆలయాన్ని రూ.30 కోట్లతో నిర్మించారు. ఇందులోనే ఆలయ నిర్మాణం, నాట్య మండపాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం సహా కేంద్ర హోంమంత్రి, కేంద్ర పర్యటక మంత్రి పాల్గొననున్నారు.
Covid 19 Vaccine for Children: సెప్టెంబర్ నాటికి మార్కెట్ లోకి పిల్లల కరోనా వ్యాక్సిన్!
ఒలింపిక్స్ విజేతలతో భేటీ..
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లకి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 16న తన నివాసంలో ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరితో పాటు ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మహిళల హాకీ జట్టును కూడా మోదీ కలిశారు. ప్రతి ఒక్క అథ్లెట్‌తో మోదీ ఆత్మీయంగా మాట్లాడారు. వారి శిక్షణ, కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.
క్రీడాకారులతో మాట్లాడిన వీడియోను మోదీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'మన ఒలింపిక్స్ హీరోలతో మర్చిపోలేని రోజు' అంటూ ఆ వీడియోకి వ్యాఖ్య జత చేశారు.