PM Modi at G7 Summit: G7 సదస్సుకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తరవాత మోదీతో మెలోని స్పెషల్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరూ నవ్వులు చిందిస్తూ కనిపించారు ఈ ఫొటోలో. మెలోనీ ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. ఇది కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
మోదీ మెలోనీ సెల్ఫీ అంటే సోషల్ మీడియాలో భలే క్రేజ్. ఇప్పుడే కాదు. అంతకు ముందు దుబాయ్‌లో COP28 climate summit జరిగినప్పుడూ ఇద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. ఇప్పటికీ అది వైరల్ అవుతూనే ఉంది. "Good friends at COP28. #Melodi" అని మెలోని ఆ ఫొటోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసిన సందర్భంగా #Melodi హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం కీలకంగా మారింది. పైగా సభ్య దేశం కాకపోయినా భారత్‌కి G7 సదస్సులో ఇంత ప్రాధాన్యత దక్కడమూ ఆసక్తికర పరిణామం.
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. G7 సదస్సుకి తనకు ఆహ్వానం పంపినందుకు ఆమెకి థాంక్స్ చెప్పారు. ఈ సమ్మిట్ కోసం చేసిన ఏర్పాట్లపైనా మోదీ ప్రశంసలు కురిపించారు. భారత్-ఇటలీ మైత్రి మరింత బలపరిచే దిశగా చర్చలు జరిగినట్టు వెల్లడించారు. ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ, టెలికామ్ సహా పలు కీలక రంగాల్లో పరస్పర సహకరించుకుంటామని తెలిపారు. బయోఫ్యుయెల్స్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్‌లోనూ ఈ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్, ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చలు జరిపారు. అన్ని దేశాలతోనూ భారత్ మైత్రిని కొనసాగిస్తుందని స్పష్పం చేశారు.
Also Read: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం,లోయలో పడిన టెంపో ట్రావెలర్ - 8 మంది మృతి