PM Modi Amritsar Visit:


ఎన్నికల ర్యాలీ ముందు..


ప్రధాని నరేంద్ర మోదీ బాబా గురీందర్ సింగ్ ధిల్లాన్‌ను కలిశారు. ఆ తరవాత డేరాను సందర్శించారు. రాధా సోమి సత్సంగ్ బీస్‌ అధిపతి అయిన బాబా గురీందర్ సింగ్‌ను ప్రధాని కలవటం వెనక రాజకీయ కారణాలున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించే ముందు ఆయనను కలిశారు మోదీ. పంజాబ్ ఎన్నికల ముందు కూడా ప్రధాని మోదీ ఇలానే బాబా గురీందర్ సింగ్‌ను కలిశారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు వివరణ ఇస్తున్నారు. బాబా గురీందర్ సింగ్‌కు పంజాబ్‌లోనే కాకుండా హిమాచల్ ప్రదేశ్‌లోనూ ప్రజాదరణ ఉంది. ఆయన ఎన్నికలనూ ప్రభావితం చేయగలరు. ఆయనకు పంజాబ్‌లోనే కాకుండా హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ పెద్దఎత్తున అనుచర గణం ఉంది. రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారని కొందరు చెబుతున్నారు. మరి ఈ సమావేశంతో భాజపా ఎంత మైలేజ్‌ సాధిస్తుందో చూడాల్సి ఉంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇవాళ భారీ ర్యాలీ జరగనుంది. మండి జిల్లాలోని సురేంద్రనగర్‌పై భాజపా ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ భాజపా ఓటు బ్యాంకు ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ ఇదే ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఫలితంగా...ఈ జిల్లాలోని 10 సీట్లలో 9 స్థానాలు భాజపా కైవసం అయ్యాయి. దాదాపు నెలన్నరగా ప్రధాని మోదీ హిమాచల్‌లో తరచూ పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన మండీలో జరిగిన ర్యాలీలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆ తరవాత అక్టోబర్ 13న ఉనా, చంబాలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లకు హాజరయ్యారు. అదే రోజు ఉనా నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. 






నవంబర్ 12న పోలింగ్..


హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. హిమాచల్‌లో భాజపా అధికారంలో ఉంది. ఈ సారి కూడా కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది కాషాయ పార్టీ. 88 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌ప్రదేశ్‌లో 2017లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు భాజపా అధికారంలోకి రాగా...జైరామ్ ఠాకూర్ సీఎం అయ్యారు.


Also Read: MS Dhoni moves Madras HC: మద్రాస్‌ హైకోర్టుకు ఎంఎస్‌ ధోనీ!