సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కొత్త సినిమా 'లాల్ సలామ్' (Lal Salaam Movie) నేడు ప్రకటించారు. ఈ చిత్రానికి ఆయన కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకురాలు. అయితే... ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో రజనీ హీరో కాదు... ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఆయనది స్పెషల్ అప్పియరెన్స్ మాత్రమేనని చిత్ర బృందం వెల్లడించింది. మరి, హీరోలు ఎవరంటే...
ఇద్దరు హీరోలతో సౌందర్య సినిమా!
విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ సంతోష్ (Vikranth Santhosh) హీరోలుగా 'లాల్ సలామ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఐశ్వర్యా రజనీకాంత్. ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నేడు సినిమాను అధికారికంగా ప్రకటించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తే... క్రికెట్ నేపథ్యంలో రూపొందిస్తోన్న యాక్షన్ డ్రామాలా ఉంది. ఆ మంటలు గట్రా చూస్తుంటే... క్రికెట్ కాస్త ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీసినట్టు ఉంది. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయనున్నట్టు పోస్టర్ లో పేర్కొన్నారు.
ఐశ్వర్యకు హిట్ వచ్చేనా?
దర్శకురాలిగా ఐశ్వర్యకు నాలుగో చిత్రమిది. దీంతో అయినా హిట్ వస్తుందో? లేదో? చూడాలి. ఎందుకంటే... ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన '3' సినిమాతో ఆవిడ మెగాఫోన్ పట్టుకున్నారు. దర్శకురాలిగా తొలి సినిమా సక్సెస్ కాలేదు. కానీ, అందులో 'వై థిస్ కొలవెరి డి' సూపర్ హిట్ అయ్యింది. అనిరుధ్ రవిచంద్రన్ ఆ తర్వాత స్టార్ అయ్యారు. '3' తీశాక... మరో సినిమా 'వై రాజా వై', డాక్యుమెంటరీ 'సినిమా వీరన్' తీశారు. ఆ రెండు కూడా హిట్ కాలేదు. కిప్పుడు ఏకంగా తండ్రి రజనిని ప్రత్యేక పాత్రలో పెట్టి సినిమా తీస్తున్నారు.
కుమార్తె కోసం తప్పలేదా?
అమ్మాయి కోసం రజనీకాంత్ ఈ సినిమా చేస్తున్నారని చెన్నై టాక్. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కూడా రజని కోసం సినిమా చేయడానికి ముందుకు వచ్చారని అంటున్నారు. గతంలో చిన్న కుమార్తె సౌందర్య 'కొచ్చడయాన్' అంటూ రజనీకాంత్‌తో యానిమేషన్ సినిమా తీశారు. అప్పుడు ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఐశ్వర్య ఏం చేస్తారో?
Also Read : విజయ్ దేవరకొండను ఖాళీగా కూర్చోబెట్టిన సమంత?
ఆ మధ్య ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ఒక మ్యూజిక్ వీడియో రూపొందించారు ఐశ్వర్య రజనీకాంత్. దానికి ఆవిడ దర్శకత్వం వహించారు. 'సంచారి...' అంటూ సాగిన ఆ గీతానికి అంకిత్ తివారి సంగీతం అందించారు. దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఆలపించారు.
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా విషయానికి వస్తే... 'కొలమావు కోకిల', 'వరుణ్ డాక్టర్', 'మాస్టర్' తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చేస్తున్నారు. అందులో శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు ప్రధాన తారాగణం.