PM CARES Fund Trustees: 


టాటాతో పాటు మరికొందరు..


ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాను పీఎం కేర్స్ ఫండ్‌ (PM CARES Fund)ట్రస్టీగా నియమించింది కేంద్ర ప్రభుత్వం. టాటాతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది కేటీ థామస్ (KT Thomas), మాజీ డిప్యుటీ స్పీకర్ కరియా ముండా కూడా ట్రస్టీలుగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. పీఎం కేర్స్ ఫండ్‌లో భాగస్వాములు అవుతున్న సందర్భంగా వారికి స్వాగతం పలికింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా మరో మంత్రి అమిత్‌షా PM Cares Fundలో ట్రస్టీలుగా ఉన్నారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బోర్ట్ ఆఫ్ ట్రస్టీస్‌తో సమావేశం జరిగింది. ఈ ఫండ్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారో అక్కడ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. ఈ సమావేశంలో రతన్ టాటా కూడా పాల్గొన్నారు. PM Cares Fund కి అడ్వైజరీ బోర్డు కూడా నియమించాలని అప్పుడే నిర్ణయించారు. ఈ బోర్డు సభ్యులుగా మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ మెహర్షి, ఇన్‌ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధామూర్తి, టీచ్ ఫర్ ఇండియా కో ఫౌండర్, ఇండికార్ప్స్ పిరమల్ ఫౌండేషన్ మాజీ సీఈవో ఆనంద్ షా ఉన్నారు. ఈ ఫండ్‌ను సరైన విధంగా వినియోగించడంలో, సేవలు విస్తృతం చేయడంలో కొత్త ట్రస్టీలు పాలు పంచుకుంటారని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 










చిన్నారుల సంరక్షణ కోసం..


2021 మే 29న ప్రధాని నరేంద్ర మోదీ PM CARES for Children పథకం ప్రారంభించారు. కొవిడ్ సంక్షోభంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారుల సంరక్షణ కోసం ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో అనాథలైన చిన్నారుల బాగోగులు చూసుకుంటోంది కేంద్రం. ఇకపై...దేశంలో ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు పీఎం కేర్ నిధుల ద్వారా ప్రజలకు సహకారం అందిస్తారు. 


Also Read: Chhello Show - Oscars : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!